Akhil,Prabhas: ప్రభాస్‌ అతిథ్యం స్వీకరించటం కష్టం: అఖిల్‌

ప్రభాస్‌ బాగా తింటాడు.. బాగా తిండి పెడతాడు.. ఈ విషయం చాలామందికి తెలుసు. ఆయనతో నటించే, పని చేసే వాళ్లకు ఆయన ఫుడ్‌ ఫెస్టివలే ఏర్పాటు చేస్తాడు. గతంలో చాలామంది కథానాయికలు, హీరోలు ఈ విషయాన్ని చెప్పారు కూడా. ప్రభాస్‌ పంపించిన ఫుడ్‌ అంటూ ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు కూడా చేస్తుంటారు. అది చూసి అభిమానులు ‘మా డార్లింగ్‌ బంగారం’ అంటూ తెగ ముచ్చటపడిపోతుంటారు. అలాంటి ఫ్యాన్స్‌కి మరింత కిక్‌ ఇచ్చే వార్త ఇది. ప్రభాస్‌ గురించి అఖిల్‌ చెప్పిన మాటలు వింటే భలే కిక్కు వస్తుంది.

ఎవరైనా ప్రభాస్‌ని కలిస్తే జాగ్రత్తగా ఉండాలి అని అఖిల్‌ అంటే… ‘అవును నిజమే’ అంటూ శర్వానంద్‌ ఆయనకు వంతపాడాడు. అంతగా ఏమైంది అనుకుంటున్నారా? ఆ విషయం వాళ్లే చెప్పారు కూడా. ‘ప్రభాస్‌ ఫూడీ అని నేను విన్నా’ అని అమల చెప్పగా.. తనను కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్‌ నవ్వుతూ సమాధానం ఇచ్చడు. ‘‘ఇక చాలు బాబోయ్‌ నేను ఇక తినలేను అని చెప్పినా ప్రభాస్‌ వదిలిపెట్టడు’’ అంటూ అఖిల్‌ అమ్మ అమలకు చెప్పుకొచ్చాడు.

ఇదంతా ఎందుకు, ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? అమల, శర్వానంద్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా టీమ్‌ ‘అమ్మ చేతి వంట’ అనే చిన్న పాటి ఇంటర్వ్యూను పెట్టింది. ఈ ఇంటర్వ్యూలో అమల, అఖిల్‌, శర్వానంద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అమ్మ చేతి వంట’ రుచి చూస్తూ.. ప్రభాస్‌ గురించి మాట్లాడుకున్నారు ముగ్గురూ. అయితే ఇదంతా ప్రోమోలో కనిపించిన సన్నివేశం. ఫుల్‌ ఎపిసోడ్‌ సోమవారం వస్తుంది. ఆ రోజు ఇంకా వివరాలు తెలుస్తాయి.

‘‘ప్రభాస్‌ అతిథ్యం అద్భుతంగా ఉంటుందని, అయితే దాన్ని స్వీకరించటం కష్టం’’ అని చాలామంది తారలు చెప్పారు. ప్రభాస్‌ సన్నిహితులకు అయితే ఈ విషయం బాగా తెలుస్తుంది. శర్వానంద్‌, అఖిల్‌.. ప్రభాస్‌కి చాలా క్లోజ్‌. కాబట్టి ఈ విషయం మాట్లాడుకుని ఉంటారు. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీ కార్తీక్‌ తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ సెప్టెంబరు 9న విడుదల కానుంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus