Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

అఖిల్ అక్కినేని కెరీర్ చాలా స్లోగా సాగుతుంది. 2015 లో ‘అఖిల్’ తో ఎంట్రీ ఇచ్చాడు. అది ఆడలేదు. అక్కినేని అభిమానులు ఆశించిన స్థాయిలో అఖిల్ మెప్పించలేకపోయాడు. తర్వాత 2017లో ‘హలో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది పాస్ మార్కులు వేయించుకుంది. ఆ తర్వాత 2019 లో ‘మిస్టర్ మజ్ను’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా ఆడలేదు.

Akhil

మొత్తానికి 2021 లో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో ఓ సెమి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని 2023 లో ‘ఏజెంట్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది దారుణంగా ప్లాప్ అయ్యింది. దీంతో నెక్స్ట్ సినిమా ఓకే చేయడానికి చాలా టైం తీసుకున్నాడు అఖిల్. మధ్యలో అతని వివాహం జరిగింది. ఆ వెంటనే కొత్త సినిమాగా ‘లెనిన్’ సెట్స్ పైకి వెళ్ళింది.

ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్లోగా సాగుతుంది. మురళీ కిషోర్ అబ్బూరు అలియాస్ నందు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కొంత కంప్లీట్ అయిన వెంటనే హీరోయిన్ శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకుంది. దీంతో మరో హీరోయిన్ కోసం మేకర్స్ గాలించడం మొదలుపెట్టారు. ఓ దశలో భాగ్య శ్రీ బోర్సే ఫిక్స్ అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డారు మేకర్స్. మరోవైపు తెలుగు ఫెడరేషన్ వర్కర్స్ సమ్మె వల్ల షూటింగ్ ఆగిపోయింది. ఇక నిర్మాత నాగ వంశీ ‘మాస్ జాతర’ పనుల్లో పడి ‘లెనిన్’ ని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. సో మొత్తం ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలయ్యి కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుందట. ఈ క్రమంలో 2026 సమ్మర్ వరకు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేనట్టు టాక్ వినిపిస్తుంది. అలా చూసుకుంటే.. అఖిల్ కెరీర్లో 3 ఏళ్ళు గ్యాప్ తప్పేలా లేదనే చెప్పాలి.

‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus