తదుపరి చిత్రం కోసం తమిళ దర్శకుడిని ఫైనల్ చేసిన అఖిల్

  • November 19, 2019 / 11:02 AM IST

పాపం అదృష్టం కలిసిరాకో.. సమయం కలిసిరాకో అక్కినేని అందగాడు అఖిల్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ఇప్పటివరకూ ఒక్క విజయం కూడా సాధించలేకపోయాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న అఖిల్.. ఈ సినిమా అనంతరం ఓ తమిళ దర్శకుడు చెప్పిన కథకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

“అభిమన్యుడు” చిత్ర దర్శకుడు మిత్రన్ ఇటీవల హైద్రాబాద్ లో అఖిల్ ని కలిసి ఒక మంచి ప్రేమకథ చెప్పాడట. ప్రెజంట్ జనరేషన్ లవ్ స్టోరీకి ఒక లాజికల్ ఇష్యూని మిక్స్ చేసిన చెప్పిన కథ అఖిల్ కి బాగా నచ్చిందని, వెంటనే ప్రొజెక్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పాడట. సో, బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తర్వాత అఖిల్ హీరోగా మిత్రన్ సినిమా మొదలవ్వానుందన్నమాట. ఈ రెండు సినిమాల తర్వాత అఖిల్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఓ బడా దర్శకుడి చిత్రంలో నటిస్తాడని టాక్ వినిపిస్తోంది.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus