‘అఖిల్ 5’ లో రష్మిక మందన ఫిక్స్.. అఖిల్ కు మరో హిట్టు పడినట్టే..!

అఖిల్ అక్కినేని ఇప్పుడు ఓ విషయంలో పూర్తిగా మారిపోయాడు. తన మొదటి మూడు చిత్రాల్లోనూ హీరోయిన్ల విషయంలో పెద్దగా పట్టించుకోని అఖిల్.. ఇప్పుడు మాత్రం తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లే కావాలని పట్టుబడుతున్నాడట. అలా అయితేనే సినిమాకి అదనపు ఆకర్షణ చేకూరుతుందని.. తద్వారా సినిమాకి హైప్ కూడా పెరుగుతుందనేది అఖిల్ అభిప్రాయం కావచ్చు. హీరోగా అఖిల్ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే తాను ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవాల్సి ఉంది. అందుకే అఖిల్ ఇప్పుడు అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థలో రూపొందుతోంది కాబట్టి.. కచ్చితంగా ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక దీని తరువాత అఖిల్.. సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.’ఏ.కె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ ప్రాజెక్టుని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

హీరోయిన్ గా రష్మికను తీసుకోమని అఖిల్ సూచించాడట. ఇదే బ్యానర్లో ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సూపర్ హిట్ చిత్రం చేసింది. దాంతో ఆమెను నిర్మాత సంప్రదించగా.. ఓకే చెప్పేసిందనట్టు టాక్ వినిపిస్తుంది. రష్మిక మందనను గోల్డెన్ లెగ్ అని ప్రేక్షకులు అంటుంటారు.ఆమె నటించిన సినిమాలు అన్నీ దాదాపు హిట్లే. ఆ రకంగా చూసుకుంటే అఖిల్ డెసిషన్ సూపర్ అనే చెప్పాలి..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus