టాలీవుడ్‌లో మరో అలజడి రేగింది. బంగారం స్కామ్‌లో ఓ తెలుగు నిర్మాతను పోలీసులు అరెస్టు చేయడమే దీనికి కారణం. ఇప్పటికే ఐదు కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు కె.లక్ష్మీకాంత్ రెడ్డినే ఇప్పుడు పోలీసు మరోసారి అరెస్టు చేశారు. ఆయన ఇటీవల ‘లఫూట్ గ్యాంగ్’ అనే సినిమాను నిర్మించారు. ఇక అరెస్టు విషయానికొస్తే.. రూ.2.21 కోట్ల గోల్డ్ స్కామ్ కేసులో ఆయన్ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి XII అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
బాధితుడు రాకేష్ బలరాం గౌడ్ తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి, విడతల వారీగా రూ.2.21 కోట్లు తీసుకున్నారు అని లక్ష్మీకాంత్ రెడ్డి మీద అభియోగం. అయితే బంగారం ఇవ్వకుండా, డబ్బు తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో బాధితుడు ఆరోపించారు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే ఆయన బెదిరించాడు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తొలుత ఈ విషయానని సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు.. అక్కడ తగిన చర్యలు లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. విషయం రూ.2.21 కోట్లు కావడంతో దర్యాప్తును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌కు అనంతరం సీసీఎస్, హైదరాబాద్ విభాగానికి బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో అతనిపై ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసులు నమోదైనట్లు తేలింది. మహంకాళి పీఎస్, రాయదుర్గం, కోయిల్‌కొండ, పెందుర్తి, హైదరాబాద్ సీసీఎస్ స్టేషన్లలో ఆ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.