Akhil: టాస్క్ లో చించి ఆరేసిన అఖిల్..! ఆ ఒక్క విషయంలోనే తడబడ్డాడు..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారులుగా అఖిల్ అండ్ టీమ్ గెలిచింది. అయితే, బిగ్ బాస్ ఎప్పటిలాగనే టీమ్ నుంచీ బాగా సపోర్ట్ చేసిన ముగ్గురిని ఎంచుకోమని చెప్పాడు. దీంతో అకిల్ అషూరెడ్డి , స్రవంతి, ఇంకా అజయ్ లని ఎంపిక చేశాడు. తను కూడా కెప్టెన్సీ పోటీదారుడే కాబట్టి టీమ్ నుంచీ నలుగురు వచ్చినట్లుగా అయ్యింది. ఇక్కడే బిందు అండ్ టీమ్ పెర్ఫామెన్స్ కూడా చాలా బాగుందని, అందుకే ఆ టీమ్ నుంచీ కూడా కెప్టెన్సీ కోసం ఇద్దరు రావచ్చని బిగ్ బాస్ చెప్పేసరికి టీమ్ లో డిస్కషన్స్ మొదలయ్యాయి.

Click Here To Watch NOW

ఫైనల్ గా బిందు, ఇంకా శివ ఇద్దరూ పార్టిసిపేట్ చేయాడనికి ఒప్పుకున్నారు. ఇక్కడే హమీదానా, శివనా అన్న విషయం వచ్చేసరికి వాళ్లిద్దరూ తేల్చుకుంటారులే అని వాళ్లని వదిలేసింది టీమ్. దీంతో హమీదా కెప్టెన్ అయ్యేవరకూ టాస్క్ లలో హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాడు శివ. దీంతో హమీదా రేస్ నుంచీ తప్పుకుంది. ఇక జడ్జిగా ఫెయిర్ డెసీషన్ తీస్కుందని మెజారిటీ హౌస్ మేట్స్ ఓట్ల ద్వారా ముమైత్ ఖాన్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొంది.

గార్డెన్ ఏరియాలో ఉన్న రింగ్ లో అందరూ ఉండి, తమ ముఖం కలిగిన జెండాలని కలక్ట్ చేసి వారికి కేటాయించిన ప్లేస్ లో గుచ్చాలి. ఇక్కడే బలం ఎవరికి ఎక్కువగా ఉంటే వాళ్ల వైపు రింగ్ కదులుతుంది. దీంతో అఖిల్ , అజయ్ ఇధ్దరూ గేమ్ ఛేంజర్స్ గా మారారు. ముందుగా బిందు, శివ, ముమైత్ ఖాన్ రేస్ నుంచీ అవుట్ అయ్యారు. అషూరెడ్డి, స్రవంతి, అజయ్ , ఇంకా అఖిల్ మాత్రమే మిగిలారు. ఇక్కడే స్రవంతి నన్ను కెప్టెన్ చేయండి అంటూ డీల్ మాట్లాడింది.

అఖిల్ అండ్ అజయ్ ఇద్దరూ డిస్కస్ చేసుకుని స్రవంతిని కెప్టెన్ చేద్దామనే అనుకున్నారు. కానీ, ముమైత్ ఖాన్ అబ్జక్ట్ చేసింది. అలాగైతే ఫస్ట్ నేను అడిగాను కదా అని చెప్పింది. నాకు ఫేవర్ చేయలేదు. మరి ఇప్పుడు స్రవంతికి ఎలా చేస్తారు అంటూ నిలదీసింది. దీంతో అఖిల్ మనసు మార్చుకున్నాడు. ఈ ఒక్క విషయంలోనే కాస్త తడబడ్డాడు అఖిల్. స్రవంతికి ఇద్దామా వద్దా అని చాలాసేపు ఆలోచించాడు. పైనల్ గా గేమ్ చివరి వరకూ ఆడదామనే డిసైడ్ అయ్యాడు.

తర్వాత రౌండ్ లో స్రవంతి అవుట్ అయ్యింది. ఆ తర్వాత అషూరెడ్డి కూడా గేమ్ లో నిలవలేకపోయింది. దీంతో అజయ్ ఇంకా అఖిల్ ఇద్దరు మాత్రమే మిగిలారు. అఖిల్ అజయ్ ని సునాయసంగా ఓడించి కెప్టెన్ అయ్యాడు. దీంతో ఐదోవారం కెప్టెన్ గా అఖిల్ నిలిచాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus