Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌.. ఇప్పుడు సౌత్‌ సినిమాలో ఎక్కువ పారితోషికం తీసుకునే సంగీత దర్శకుల్లో ఒకరు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లు, కొత్త మ్యూజిక్‌ డైరక్టర్‌, ప్రామిసింగ్‌ సంగీత దర్శకులు ఎంతమంది వస్తున్నా.. ఓ పెద్ద హీరో సినిమా అనగానే టాలీవుడ్‌ దర్శకనిర్మాతల చూపు తమన్‌ వైపే వెళ్తోంది. దీంతో మోస్ట్ పెయిడ్‌ సంగీత దర్శకుడిగా నిలిచారాయన. అలాంటి తమన్‌ బాల్యం గురించి తెలుసుకుంటే అందరూ బాధపడతారు.

Thaman

గతంలో కొన్ని సందర్భాల్లో తన బాల్యం గురించి చెప్పిన తమన్‌.. మరోసారి నాటి రోజుల గురించి మాట్లాడారు. ‘నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. దాంతో చదువు ఆపేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నాను. నాన్న ఎల్‌ఐసీ పాలసీ ద్వారా వచ్చిన రూ.60 వేలతో డ్రమ్స్ కొనుక్కుని సంగీత ప్రయాణం మొదలుపెట్టాను అని చెప్పారు.

అయితే 2017లో నమ్మిన స్నేహితుడే మోసం చేశాడట. దీంతో ఆర్థికంగా నష్టపోయానని చెప్పారు తమన్‌. ఆ సమయంలో బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి నెలకొందట. ఆ అనుభవమే తనను మరింత దృఢంగా మార్చిందని తమన్‌ చెప్పడు. ఈ క్రమంలో ఆయన నేటి తరం పరిస్థితి గురించి కూడా మాట్లడారు. యువత పొదుపు కంటే ఖర్చుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సంపాదించిన దాంట్లో 80 శాతం పొదుపు చేసి, 20 శాతం ఖర్చు చేయాలి అని అన్నారు.

‘కాకా’ సినిమా గురించి చెబుతూ.. చిరంజీవితో పనిచేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌కు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారు. పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చానో, చిరంజీవి ‘కాకా’ సినిమాకు అంతే అద్భుతమైన ఆల్బమ్ ఇస్తా. తమ్ముడి సినిమాకు చేసినట్లే, అన్నయ్య సినిమాకూ ప్రాణం పెట్టి పనిచేస్తా అని తమన్‌ చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన గ్లింప్స్‌ మ్యూజిక్‌కి మంచి స్పందనే వచ్చింది.

మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus