నువ్వు బ్రతికావంటే… నేనే చంపేస్తాను..!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను తన భార్య ట్వింకిల్ ఖన్నా… ‘నిన్ను చంపేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. అసలు తన భర్త పట్ల ఇంత ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసింది అనుకుంటున్నారా..? దీనికి ముఖ్య కారణం అక్షయ్ కుమార్ ఇటీవల చేసిన ఓ స్టంట్. వివరాల్లోకి వెళితే… ఇటీవల అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్నాడు. ఇది అక్షయ్ నటించబోతున్న మొదటి వెబ్ సిరీస్ కావడంతో దీన్ని గ్రాండ్ గా ప్రమోట్ చేయాలనీ అనుకున్నారు.

ఈ ప్రమోషన్లలో భాగంగా అక్షయ్ కుమార్ ఒంటికి నిప్పంటించుకొని స్టేజ్ పై నడుస్తూ వచ్చే ఓ షాట్ ను తీశారు. ఏ హీరో చేయని స్టంట్ అక్షయ్ కుమార్ చేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఆయన అభిమానులు మాత్రం ఆందోళన చెందారు. ఇక అక్షయ్ కుమార్ భార్య అయితే ఏకంగా అతడికి వార్నింగ్ ఇచ్చింది. ‘నీ ఒంటికి నువ్వే నిప్పంటించుకున్నావ్. దీని తరువాత కూడా నువ్ బ్రతికే ఉంటే ఇంటికి రా.. నిన్ను నేను చంపేస్తాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చుసిన అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. ”ఆ స్టంట్ చేసినప్పుడు కూడా నాకు భయమనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ విషయంలో నిజంగా నాకు భయంగా ఉంది” అంటూ ట్వీట్ పెడుతూ.. ‘దేవుడానన్ను కాపాడాలి’ అంటూ హ్యాష్ ట్యాగ్ తగిలించాడు.ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus