సాధారణంగా స్టార్ సెలబ్రెటీలు బయటకు వచ్చినప్పుడు వారి స్థాయికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం వారి స్టార్ డమ్ పక్కనపెట్టి సాధారణ ప్రజల మాదిరిగా అందరితో కలిసి పోతూ ఉంటారు. ఇలా సామాన్య ప్రజలుగా కొన్నిసార్లు సెలబ్రిటీలు వ్యవహరించే తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం అలియా భట్ కి సంబంధించిన ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా హాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక్కడ కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక అలియా భట్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈమె నటుడు రణబీర్ కపూర్ ను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
వివాహం జరిగిన ఏడాదికే తనకు కుమార్తె జన్మించడంతో ప్రస్తుతం కుమార్తె ఆలనా పాలన చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే త్వరలోనే ఈమె ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా అలియా తన ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్స్ తనని చుట్టుముట్టి తన ఫోటోలను క్యాప్చర్ చేశారు. ఇక అలియా భట్ సైతం ఫోటోలకు ఫోజులిచ్చారు అయితే ఈమెకు ఫోటోలు తీస్తునటువంటి క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ తన చెప్పు మిస్ చేసుకున్నారు.
దీంతో అలియా భట్ (Alia Bhatt) స్వయంగా తన చొప్పున వెతికి చేతితో పట్టుకొని తనకు ఇచ్చారు. అప్పటికి ఫోటోగ్రాఫర్స్ వద్దు అని చెబుతున్నప్పటికీ ఈమె స్వయంగా తనకు చెప్పు ఇవ్వడంతో ఈమె సింప్లిసిటీ పట్ల నేటిజన్స్ ఫిదా అవుతూ తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.