హీరోయిన్స్ లైఫ్ స్టైల్ చూసి చాలా మంది కుళ్లుకొంటారు. ఈర్ష్యపడేంత ఆనందంతోపాటు చెప్పుకోలేనంత అగాధం కూడా వారి జీవితాల్లో ఉంటుంది. ఒక్కోసారి సినిమా స్టార్ట్ అయ్యిందనే విషయాన్ని ఆనందంతో చెప్పుకొనే ఈ హీరోయిన్లు.. ఆ సినిమా ఆగిపోతే ఏం చెప్పాలో అర్ధం కాక సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు కానీ.. ఫైనల్ గా ఎఫెక్ట్ అయ్యేది మాత్రమే హీరోయినే. ప్రస్తుతం ఆలియా ఇలాంటి సిచ్యుయేషన్ ను ఫేస్ చేస్తోంది. అమ్మడు రీసెంట్ గా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా “ఇన్షాల్లా” అనే సినిమా సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకముందే ఆగిపోయింది. ఆగిపోవడానికి రీజన్ ఏమిటనేది తెలియదు కానీ.. సల్మాన్ & సంజయ్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
అయితే.. ఈ సినిమా ఆగిపోవడం వెనుక ఉన్న కారణం తెలియని ఆలియా మాత్రం మీడియాకి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక సైలెంట్ అయిపోతోంది. సంజయ్ లీలా భన్సాలీ మాత్రం ఆలియాను తప్పకుండా డైరెక్ట్ చేసి తీరాలన్ నిశ్చయించుకొన్నాడట. మరి సల్మాన్ స్థానంలో ఎవరు వస్తారో చూడాలి.