Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » 7/G బృందావన్ కాలనీ’ సీక్వెల్‌కు మళ్లీ అదే టీమేనా?

7/G బృందావన్ కాలనీ’ సీక్వెల్‌కు మళ్లీ అదే టీమేనా?

  • April 23, 2023 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

7/G బృందావన్ కాలనీ’ సీక్వెల్‌కు మళ్లీ అదే టీమేనా?

సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2004లో రిలీజై, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘7/G బృందావన్ కాలనీ’ సీక్వెల్ త్వరలోనే రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీ జూలైలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. 7/G దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2004లో విడుదలైన బ్లాక్ బస్టర్ తమిళ చిత్రం ‘7/G రెయిన్‌బో కాలనీ’ (తెలుగులో 7/G బృందావన్ కాలనీ) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

రొమాంటిక్ డ్రామాకి సీక్వెల్ త్వరలోనే రాబోతుందని గతేడాది చిత్ర నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. ఈ నేపథ్యంలో జులై నుంచి ఈ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘7/G బృందావన్ కాలనీ’లో హీరోగా నటించిన రవికృష్ణ సీక్వెల్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. ‘7/G బృందావన్ కాలనీ సినిమాలో హీరోగా రవికృష్ణ నటించగా, సోనియా అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు అత్యంత సహజంగా తెరకెక్కించడంతో ఈ మూవీ చాలా తొందరగా యూత్ ను ఆకట్టుకుంది.

యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందించిన 7/G బృందావన్ కాలనీలోని పాటలు సైతం సూపర్‌హిట్‌ అయ్యాయి. దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత రవికృష్ణ, సోనియా అగర్వాల్ లు కొన్ని సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత ఇద్దరూ సినిమాలు చేయడం మానేశారు. సోనియా మాత్రం కొన్ని సినిమాలు చేస్తూ వస్తోంది. ఆ తర్వాత గతేడాది ఈ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారంటూ నిర్మాత ఎం.రత్నం చెప్పారు. ఈ సీక్వెల్ లో ఎవరు నటిస్తారనేది చర్చనీయంగా మారింది.

సీక్వెల్‌లో కూడా రవికృష్ణే ఉంటేనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలరనే అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే హీరో విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. జూలైలో షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా సీక్వెల్ పై మేకర్స్, నిర్మాత లేదా నటులు ఎవరూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఆ వార్తే నిజమైతే బాక్సాఫీస్ వద్ద హిట్ ఖాయం అని పలువురు భావిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్‌.. ఆ సమయంలోనే డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడ్డారు. వీరు 2006లో ప్రేమ వివాహం చేసుకోగా.. కొన్ని మనస్పర్థల కారణంగా వారిద్దరూ 2010లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తాను చాలా మానసిక క్షోభకు గురయ్యానని, ఆ సమయంలోనే తన జీవితంలోకి గీతాంజలి వచ్చిందని, ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటుచేసుకుందని, ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నామంటూ ఇటీవల సెల్వ రాఘవన్ చెప్పుకొచ్చారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #7/G Brindhavan Colony
  • #Ravi Krishna
  • #selvaraghavan
  • #sonia agarwal
  • #Suman Shetty

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

41 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version