Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Reviews » Virupaksha Review In Telugu: విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!

Virupaksha Review In Telugu: విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!

  • April 21, 2023 / 11:50 AM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Virupaksha Review In Telugu: విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సాయి ధరమ్ తేజ్ (Hero)
  • సంయుక్త మీనన్ (Heroine)
  • బ్రహ్మాజీ , సాయి చంద్‌ , అజయ్ తదితరులు.. (Cast)
  • కార్తీక్ వర్మ దండు (Director)
  • బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ (Producer)
  • అజ‌నీష్ లోక్‌నాథ్ (Music)
  • శాందత్ సాయినుద్దీన్ (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 21, 2023

“రిపబ్లిక్” అనంతరం అనుకోని విధంగా జరిగిన యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న సాయిధరమ్ తేజ్ టైటిల్ పాత్రలో నటించగా విడుదలైన చిత్రం “విరూపాక్ష”. 2015లో విడుదలైన “భమ్ బోలేనాధ్”తో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ దాదాపు ఏడేళ్ళ అనంతరం మళ్ళీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. సాయిధరమ్ తేజ్ కెరీర్ కి “విరూపాక్ష” హెల్ప్ అయ్యిందో లేదో చూద్దాం..!!

కథ: 1979 కాలంలో రుద్రవనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు.. ఆ ఊరి విధివిధానాలను మార్చేస్తాయి. అలా జరిగిన కొన్నేళ్లకు సూర్య (సాయిధరమ్ తేజ్) తల్లితో కలిసి రుద్రవనానికి వస్తాడు. అక్కడ తొలి చూపులోనే నందిని (సంయుక్త మీనన్)తో ప్రేమలో పడతాడు. ఊరు మొత్తం పీడశక్తి కారణంగా అల్లకల్లోలమవుతున్న సందర్భంలో.. సూర్య ధైర్యంగా నిలబడి, రుద్రవనానికి పట్టిన పీడను తొలగించడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. అసలు రుద్రవనంలో ఏం జరిగింది? ఆ ఊరి ప్రజలను కాపాడడానికి సూర్య చేసిన సాహసం ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి.

నటీనటుల పనితీరు: నటుడిగా సాయిధరమ్ తేజ్ లో ఎనర్జీ లోపించింది. అతడి పాత్రలోని కచ్చితత్వం, నిజాయితీ కనిపించినప్పటికీ.. ఇంకాస్త హుషారు ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సాయితేజ్ నటన విషయంలో బాగా తేలిపోయాడు. మరి యాక్సిడెంట్ ఎఫెక్టో లేక.. సెటిల్డ్ గా చేయాలనే తపనతో తన మార్క్ ఇంటెన్సిటీని పక్కన పెట్టాడో తెలియదు కానీ.. సాయితేజ్ వీక్ పెర్ఫార్మెన్స్ తేటతెల్లమవుతుంది.

సంయుక్త మీనన్ ఈ చిత్రంలోని నందిని పాత్రలో ఆశ్చర్యపరిచింది. ఆమెకు నటన రాదంటూ కామెంట్ చేసినవాళ్లందరి నోర్లు మూయించింది. ఆమె పాత్ర సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. తెలుగు చిత్రసీమలో ఆమె స్థానాన్ని ఇంకాస్త బలపరిచింది.

అజయ్, రవికృష్ణలు ఈ చిత్రంతో తమలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వారి క్యారెక్టరైజేషన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సాయిచంద్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కార్తీక్ వర్మ దండు గురించి మాట్లాడుకోవాలి. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా తాను అనుకున్న కథను అద్భుతంగా తెరపై ప్రెజంట్ చేశాడు. ముఖ్యంగా.. సినిమాలో అనవసరంగా పాటలు ఇరికించకుండా.. థీమ్ మ్యూజిక్ తో సెకండాఫ్ ను నడిపిన విధానం బాగుంది. అలాగే.. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంలో కీలకపాత్ర పోషించింది. కథకుడిగా, దర్శకుడిగా కార్తీక్ దండు సూపర్ హిట్ కొట్టాడు. అయితే.. క్లైమాక్స్ ను ఇంకాస్త బెటర్ గా డీల్ చేసి ఉండొచ్చు. అప్పటివరకూ క్రియేట్ చేసిన టెన్షన్ కి ఇచ్చిన ఎండింగ్ బాగున్నా.. ప్రీక్లైమాక్స్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అందువల్ల.. చిన్న అసంతృప్తి మాత్రం కలుగుతుంది.

అజనీష్ లోక్నాధ్ ఈ సినిమాకి మెయిన్ హీరో. తన మార్క్ నేపధ్య సంగీతం & సౌండ్ డిజైనింగ్ తో ఓపెనింగ్ సీక్వెన్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేశాడు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే మాత్రం ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.అలాగే.. సౌండ్ మిక్సింగ్ విషయంలో తీసుకున్న కేర్ కూడా ప్రశంసనీయం. ఇక షాందత్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ ను వేరే ప్రపంచంలో కూర్చోబెట్టేసింది. సినిమాని 1980ల కాలంలో జరిగే కథగా ఎస్టాబ్లిష్ చేయడం మంచి ప్లస్ అయ్యింది. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి.

విశ్లేషణ: తెలుగులో ఒక మంచి కమర్షియల్ హారర్ థ్రిల్లర్ వచ్చి చాన్నాళ్లయ్యింది. మొన్న వచ్చిన “మసూద” కూడా హారర్ సినిమా అయినప్పటికీ.. “విరూపాక్ష” ఇంకాస్త ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో కరెక్ట్ టైమ్ లో పడిన హిట్ సినిమా ఇది. ఒక మంచి థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని కచ్చితంగా చూడాల్సిందే.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmaji
  • #Karthik Dandu
  • #Sai Chand
  • #Sai Dharam Tej
  • #Samyuktha Menon

Reviews

Raid 2 Review in Telugu: రెయిడ్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Raid 2 Review in Telugu: రెయిడ్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Tourist Family Review in Telugu: టూరిస్ట్ ఫ్యామిలీ  సినిమా రివ్యూ & రేటింగ్!

Tourist Family Review in Telugu: టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Black, White & Gray – Love Kills Review in Telugu: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Black, White & Gray – Love Kills Review in Telugu: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Retro Review in Telugu: రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Review in Telugu: రెట్రో సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Samyuktha Menon: ఆ స్టార్ హీరోకు జోడీగా సంయుక్త మీనన్.. నిజమెంత?

Samyuktha Menon: ఆ స్టార్ హీరోకు జోడీగా సంయుక్త మీనన్.. నిజమెంత?

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

12 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

Retro Collections: ‘రెట్రో’ .. ఓపెనింగ్స్ ఓకే.. కానీ వీక్ డేస్ లో డౌన్ అయిపోయింది..!

12 hours ago
#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

#Single First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా?

16 hours ago
OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘ఓదెల 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

18 hours ago
Suriya: ‘రెట్రో’ లాభాలతో  సూర్య సేవా కార్యక్రమాలు!

Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

20 hours ago

latest news

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

14 hours ago
Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

Nani: ఆ లోటు తీర్చాలనుకుంటున్న నాని!

14 hours ago
Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

Jr NTR: ‘డ్రాగన్’ నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ కి ఫీస్ట్ గ్యారెంటీ!

14 hours ago
Bhool Chuk Maaf: థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

Bhool Chuk Maaf: థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి ఇచ్చేస్తున్నారు!

15 hours ago
Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

Mahesh Babu: 26 ఏళ్ళ సినీ కెరీర్లో మొదటి సారి మహేష్ డేరింగ్ స్టెప్..!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version