Allu Arjun: దుబాయ్‌లో అల్లు అర్జున్ వాక్స్ స్టాట్యూకి సర్వం సిద్ధం.. వీడియో వైరల్!

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఆల్రెడీ ‘పుష్ప'(పుష్ప: ది రైజ్) తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అదీ కాక ఇటీవల ‘పుష్ప’ సినిమాకి గాను అతనికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ లభించింది. టాలీవుడ్ చరిత్రలో ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ సంస్థ.. అల్లు అర్జున్ పై ఓ స్పెషల్ షార్ట్ డాక్యుమెంటరీ చేయడం కూడా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇండియాలో ఈ ఘనత అందుకున్న ఫస్ట్ యాక్టర్ కూడా (Allu Arjun) బన్నీనే.! అలాగే వరల్డ్ వైడ్ గా అందరూ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో(దుబాయ్ లో) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం పెట్టడానికి కూడా రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే.గతంలో ప్రభాస్, మహేష్ బాబులకి కూడా ఈ గౌరవం దక్కింది. ఇక అల్లు అర్జున్ వ్యాక్స్ స్టాట్యూ కోసం కొలతలు వంటివి కూడా తీసుకుంది మేడమ్ టుస్సాడ్స్ సంస్థ.

అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అల్లు అర్జున్ సూటు బూటు వేసుకుని చాలా స్టైలిష్ గా కనిపించాడు. త్వరలోనే ఈ వ్యాక్స్ స్టాట్యూ వేడుక కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరపడుతూ లైకుల వర్షం కురిపిస్తూనే షేర్ లు చేస్తుండటం విశేషం.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus