‘నేను శైలజ’ ‘నేను లోకల్’ వంటి చిత్రాలతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా మారింది. అయితే ‘మహానటి’ సినిమా ఈమెకు స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. అటు తర్వాత వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. త్వరలో ‘దసరా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. స్టార్ హీరోయిన్ల పై పెళ్లి రూమర్స్ రావడం సహజమే.
ఇందుకు కీర్తి సురేష్ అతీతం కాదు. గతంలో ఈమె పెళ్లి గురించి కూడా చాలా వార్తలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ కీర్తి పెళ్లికూతురు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈసారి వీటికి కాస్త డోస్ ఎక్కువ చేసి ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే.. కీర్తి సురేష్ తల్లిదండ్రులు… ఆమెకు వరుడిని కూడా ఫిక్స్ చేసేశారట. ఆమె కూడా నో చెప్పడానికి కారణాలు లేక యెస్ చెప్పింది అంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అక్కడితో అయిపోలేదు. కీర్తి సురేష్ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పబోతుందట.పెళ్లయ్యేలోపు తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసి… పూర్తిగా సినిమాలకు దూరం కావాలనే ఉద్దేశంలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది.ఒకవేళ కీర్తి సురేష్ సినిమా రంగంలో ఉంటే నిర్మాతగా కొనసాగుతుందని నిర్ణయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఇవి వట్టి పుకార్లే అని కీర్తి సురేష్ టీం వెల్లడించింది.
ప్రస్తుతం ఆమె దృష్టి అంతా సినిమాలపైనే ఉందని వారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కీర్తి సురేష్ వయసు 30 ఏళ్ళు. ప్రస్తుతం ఆమె ‘దసరా’ తో పాటు చిరంజీవికి చెల్లెలి పాత్రలో ‘భోళా శంకర్’ మూవీలో కూడా నటిస్తుంది. అలాగే తమిళంలో జయం రవి హీరోగా నటిస్తున్న ‘సైరన్’ మూవీలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.2023 లో ఈ సినిమాలన్నీ రిలీజ్ కాబోతున్నాయి.
లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..