Radhe Shyam: రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విక్రమాదిత్య ఎవరు?

రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియదు గాని ఈ సినిమాపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ పెద్దగా బజ్ క్రియేట్ చేసింది లేదు. కేవలం ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అని తప్పితే మరొక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయలేదు. ప్రమోషన్ విషయంలో అయితే అభిమానులు చాలా అప్సెట్ అవుతున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను మరో లెవెల్ కు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నారు.

సినిమాకు సంబంధించిన టీజర్ ఈ నెల 23న ఉదయం 11:16 గంటలకు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. విక్రమాదిత్య ఎవరు అనే ప్రశ్నతో పోస్టర్ ను విడుదల చేసిన రాధేశ్యామ్ టీమ్ టీజర్ పై కొంత సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన షేడ్స్ లలో కనిపిస్తారని ఒక టాక్ అయితే వస్తోంది. ఇక పూజా హెగ్డే పాత్రలో కూడా భిన్నమైన షేడ్స్ ఉంటాయని సమాచారం.

దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను ఒక లవ్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కించాలని చూస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త ప్రేమ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారట. ఇక సినిమాకు సంబంధించిన పాటల విషయంలో కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మొదటి పాటను విడుదల చేయనున్నారట. మరి సినిమా అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus