Yash: KGF 2 కంటే ముందే యష్ మరో సినిమా

Advertisement

కన్నడ స్టార్ హీరో యష్ ఒకే ఒక్క యాక్షన్ సినిమాతో ఆ సినిమా ఇండస్ట్రీ స్థాయిని ఒక్కసారిగా నేషనల్ లెవెల్ కి తీసుకు వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ పార్ట్ వన్ ఏ స్థాయిలో హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ పై బాలీవుడ్ లో కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ఏ సినిమాలను తక్కువ అంచనా వేయకూడదు ఒక క్లారిటీ అయితే వచ్చింది.

కన్నడ సినిమా ఇండస్ట్రీలో 50 కోట్ల వసూలు అందుకుంటేనే ఆశ్చర్యం అనుకుంటున్న తరుణంలో KGF 1 మూవీ ఒక్కసారిగా వందల కోట్లు సాధించింది. అనంతరం హీరో యష్ కూడా మిగతా ఇండస్ట్రీలో మార్కెట్ పై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నాడు. KGF 2 కంటే ముందే కన్నడ ఇండస్ట్రీ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమాలను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. గతంలో తమిళ హీరోలు కూడా ఇదే తరహాలో వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

అయితే అలా వచ్చిన సినిమాలు ఏవి కూడా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు హీరోగా కన్నడ ఇండస్ట్రీ లో తన కెరీర్ కు ఎంతగానో హెల్ప్ అయిన ‘లక్కీ(2012)’అనే సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలో ప్రస్తుత రాజకీయ నాయకులు రమ్య హీరోయిన్ గా నటించింది. కేజిఎఫ్ 2ను దసరాకు విడుదల చేయాలని అనుకుంటుండగా అంతకంటే కంటే ముందే లక్కీ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus