‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఈ బ్యానర్ నుండి చాలానే వచ్చాయి. తర్వాత ‘గీతా ఆర్ట్స్’ చిన్న సంస్థగా ‘జి ఎ 2 పిక్చర్స్’ ను స్థాపించారు. ఈ బ్యానర్లో బన్నీ వాస్ ను (Bunny Vasu) నిర్మాతగా పెట్టి సినిమాలు నిర్మించారు. బన్నీ వాస్ కూడా కూల్ గా అన్ని బాధ్యతలు చక్కబెడుతూ వచ్చారు. ఓ సందర్భంలో ‘బన్నీ వాస్ నా సొంత కొడుకు లాంటి వాడు’ అని అల్లు అరవింద్ (Allu Aravind) చెప్పడం కూడా జరిగింది.
ఇక అల్లు అర్జున్ కి (Allu Arjun) రైట్ హ్యాండ్ మాదిరి కూడా ఉంటూ వస్తున్నారు అల్లు అరవింద్. ఇలాంటి బన్నీ వాస్ కొన్నాళ్లుగా ‘గీతా ఆర్ట్స్’ సంస్థకి సంబంధించిన పనుల్లో ఎక్కువగా ఉంటున్నారని.. సొంతంగా వేరే బ్యానర్ స్థాపించే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు అని కూడా వార్తలు వచ్చాయి. మరోపక్క విద్యా కొప్పినీడిని (Koppineedi Vidya) సీఈఓగా తీసుకొచ్చిన అల్లు అరవింద్ మెల్లగా ఆమెకు ‘జి ఎ 2 పిక్చర్స్’ పనులు అప్పగిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది.
తాజాగా ఈ ప్రచారానికి అల్లు అరవింద్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ” ‘గీతా ఆర్ట్స్’ నుండి బన్నీ వాస్ వేరు పడటం జరగలేదు. విద్యా కొప్పినీడి కూడా బన్నీ వాస్ తో కలిసి భవిష్యత్తులో సినిమాలు నిర్మిస్తుంది. ఈ ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు” అంటూ అల్లు అరవింద్ చెప్పడం జరిగింది.
గీతా ఆర్ట్స్ కి బన్నీ వాసు, విద్య రెండు కళ్ళు లాంటివాళ్ళు
గీతా ఆర్ట్స్ నుంచి బన్నీ వాసు దూరమవుతాడు అనే రూమర్స్ కి చెక్ పెట్టిన అల్లు అరవింద్#Single #SreeVishnu #ketikasharma #Ivana #AlluAravind #BunnyVasu pic.twitter.com/Xj08oEGlk8
— Filmy Focus (@FilmyFocus) April 28, 2025