Allu Arjun: విజయ్ దేవరకొండ తరువాత బన్నీనే!

  • May 26, 2021 / 04:14 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మలయాళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా అతడికి ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. అల్లు అర్జున్ నటించిన సినిమాలను మలయాళంలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అక్కడి అభిమానులంతా బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. ఇక ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో బన్నీకి బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడింది.

చాలా మంది బాలీవుడ్ స్టార్లు సౌత్ లో తమ అభిమాన హీరో బన్నీ అని చెబుతుంటారు. ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అంతకుమించి ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 12 మిలియన్ ఫాలోవర్లను చేరుకొని రికార్డు సృష్టించింది. ముందుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా 12 మిలియన్ క్లబ్ లో చేరిపోయాడు. ఇక బన్నీకి ఫేస్ బుక్ లో 2.1 మిలియన్, ట్విట్టర్ లో 5.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

ఈ నెంబర్లను బట్టి సౌత్ ఇండియాలో బన్నీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus