అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘ముత్యంశెట్టి మీడియా’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయిందట.. చాలా బాగా వచ్చిందని కూడా టాక్. ఇక ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు సుకుమార్. రాజమౌళికి కీరవాణి ఎలాగో.. సుకుమార్ కు దేవి శ్రీ ప్రసాద్ అలాగ.. అన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ‘దేవి ఈ మధ్యలో ఫామ్లో లేని కారణంగా.. తమన్ ను తీసుకుందాం’ అని సుకుమార్ కు బన్నీ సూచించాడట. కానీ సుకుమార్ మాత్రం బన్నీ మాటను కాదని… దేవి శ్రీ ప్రసాద్ నే సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. దాంతో అల్లు అర్జున్ ఇప్పటి వరకూ తెగ టెన్షన్ పడుతూ వచ్చాడట. అయితే ఈ లాక్ డౌన్ టైం.. దేవి కి బాగా కలిసొచ్చిందట. జూమ్ యాప్, గూగుల్ మీట్ వంటి యాప్ లను ఉపయోగించుకుని దేవి తో మ్యూజిక్ సిట్టింగ్స్ వేశాడట దర్శకుడు సుకుమార్.
‘పుష్ప’ సినిమాకి కావాల్సిన ట్యూన్స్ అన్నీ ఫిక్స్ చేసేసుకున్నారట. ఇటీవల దేవిని కలవడానికి వచ్చిన సుకుమార్,అల్లు అర్జున్ లకు.. ఆ ట్యూన్స్ ను వినిపించాడట దేవి. ఈ ట్యూన్స్ విన్నాక బన్నీలో ఉన్న చింత తీరిపోయిందని టాక్.ఆ ట్యూన్స్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందట. ఎలాగూ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కాబట్టి.. ఒక్కసారి షూటింగ్ మొదలవ్వగానే ఫాస్ట్ గా ఫినిష్ చేసేలా ప్లాన్ వేసుకుంటున్నారట. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ.. ‘పుష్ప’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి.