‘పుష్ప’ కోసం బన్నీ ఎంత కష్టపడుతున్నాడు అంటే..

పుష్ప సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమా నుంచి ఎలాంటి న్యూస్ వినిపించినా, పోస్టర్ రిలీజ్ అయినా వెంటనే షేర్ చేసేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ అయితే సపరేట్ గా పోస్టర్స్ ని క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని కూడా గ్రూూప్స్ లో షేర్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ సినిమాకోసం ఇంతలా కష్టపడుతుంటే, చిత్రయూనిట్ ఊరికే కుర్చుంటుందా.. వారి అంచనాలకి తగ్గట్లుగానే తమ దమ్ముని చూపిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో షెడ్యూల్ చేసుకుంటున్న ఈ సినిమాకోసం సుకుమార్ అండ్ టీమ్ స్మార్ట్ వర్క్ చేస్తోందట. బన్నీ మేకప్ కోసం దాదాపుగా మూడుగంటల సమయం పడుతోందని, అందుకే బన్నీ సెట్స్ పైకి వచ్చేలోపు మిగతా షాట్స్ ని కంప్లీట్ చేస్తున్నారట. అంతేకాదు, లారీలని భారీగా అడవిలోకి తరలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకోసం రాత్రింబవళ్లు సుకుమార్ కంటిమీద కునుకు కూడా లేకుండా కష్టపడుతున్నట్లుగా చెప్తున్నారు. అంతేకాదు, చిత్తూరి యాసలో డైలాగ్స్ ని ప్రాక్టీస్ చేస్తూ, తన మేకప్ కోసం చాలా ఓపిగ్గా ప్రతి అంశాన్ని చాలా డిటైల్ గా చేస్తున్నాడట అల్లు అర్జున్. ఈ ఇద్దరు పనిరాక్షసులు పుష్ప సినిమాని ఒక రేంజ్ లో చూపించాలని చూస్తున్నారు. అంతేకాదు, గతంలో అల్లు అర్జున్ గెటప్స్ కంటే కూడా ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో చాలాసేపు వర్క్ చేయాల్సి వస్తోందని, అందుకే రాత్రిపూట కూడా మేకప్ తోనే ఉండిపోతున్నాడని అదే గెటప్ ని మైయిన్ టైన్ చేస్తూ సినిమాకోసం ఎంతో ఎఫెర్ట్స్ పెడుతున్నాడని అంటున్నారు. బన్నీ డెడికేషన్, హార్ట్ వర్క్ కి చిత్రయూనిట్ ఫిదా అయిపోతోందట.

అంతేకాదు, కేరళలో ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తాకిడిని తట్టుకోలేకపోతోందట మూవీ టీమ్. అయినా కూడా వచ్చిన ఫ్యాన్స్ అందర్నీ పలకరిస్తూ సినిమా షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడట బన్నీ. ఈ సినిమా ఇంకా 70శాతం చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. అందుకోసం అర్జున్ పని రాక్షసుడిలా చేస్తున్నాడని చెప్తున్నారు. ప్రతి సీన్ లో ఒరిజినల్ గా తానే చేస్తున్నాడటని, అస్సలు ఎక్కడా కూడా డూప్‌ను వాడాల్సిన అవసరం కూడా రావట్లేదని అంటున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేయాలని చూస్తోంది మూవీ టీమ్. ఇప్పటికే పుష్ప సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ కొడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus