టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ‘పుష్ప 2’ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో, బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు అట్లీతో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం బన్నీకి అందుతున్న పారితోషికం వింటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ డీల్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డుగా నిలవబోతోందట.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌కు 175 కోట్ల ఫిక్స్‌డ్ శాలరీతో పాటు, లాభాల్లో 15 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. అంటే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాలను బట్టి బన్నీ జేబులోకి వెళ్లే మొత్తం 300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఒక ఇండియన్ హీరోకు ఈ స్థాయి రెమ్యునరేషన్ అందడం అంటే అది మామూలు విషయం కాదు. షారుఖ్ ఖాన్, ప్రభాస్ లాంటి స్టార్ల సరసన బన్నీ ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా నిలిచారు.
ఈ సినిమా బడ్జెట్ సుమారు 800 కోట్లు అని తెలుస్తోంది. కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ పెట్టుబడి తిరిగి వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా మరో 200 కోట్ల వరకు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి భారీ డీల్స్ కుదురుతున్నాయంటే బన్నీ గ్లోబల్ మార్కెట్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు బన్నీ యాటిట్యూడ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు దాటడం పెద్ద కష్టమేమీ కాదని మేకర్స్ నమ్ముతున్నారు.
కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ కూడా భారీగానే వసూలు చేస్తున్నారట. ‘జవాన్’ సక్సెస్ తర్వాత అట్లీ బ్రాండ్ వాల్యూ నేషనల్ లెవల్లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి, 2027 కల్లా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.