కన్ఫ్యూజ్ నుంచి బయటికొచ్చిన అల్లు అర్జున్

Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన దువ్వాడ జగన్నాథం ఫరవాలేదనిపించినా… వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించిన నా పేరు సూర్య మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. వరుసగా రెండు దెబ్బలు పడడంతో బన్నీ ఆలోచనలో పడ్డారు. ఏ కథ తీసుకోవాలి.. ఏ డైరక్టర్ తో సినిమా చేయాలా? అని రెండు నెలలుగా కన్ఫ్యూజన్ లో ఉండేవారు. తాజాగా ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చి ఓ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. తమిళ డైరక్టర్ లింగుస్వామి, విక్రమ్ కె కుమార్, శేఖర్ కమ్ముల చెప్పిన కథలు విన్న బన్నీ.. వారికి కొన్ని మార్పులు చెప్పి బెటర్ గా తీసుకురావాలని సూచించారంట.

ఈ ముగ్గురిలో ముందుగా విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ కంప్ల్లెట్ చేసి తీసుకొచ్చారంట. ఈ వెర్షన్ బాగుండడంతో ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. గతంలో బన్నీతో ‘దేశముదురు’ ‘వరుడు’ ‘జులాయి’ లాంటి సినిమాలను తీసిన దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇందులో అల్లు అర్జున్ లవర్ బాయ్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే బరువుతగ్గే పనిలో పడ్డట్టు తెలిసింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు పది రోజుల్లో బయటికి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus