Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

సోషల్‌ మీడియా రెండు వైపులా వాడి ఉన్న కత్తి లాంటిది. జాగ్రత్తగా లేకపోతే మన చెయ్యే కట్‌ అవుతుంది అంటారు. అందుకే అందులో వచ్చే ప్రశంసలు చూసి మురిసిపోతే.. ఆ వెనుక ట్రోలింగ్‌ మొదలవుతుంది. దాన్ని తట్టుకోవడం, తేరుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌. మొన్నీమధ్య వరకు సోషల్‌ మీడియాలో ప్రశంసలు చూసి, ఫాలోవర్ల సంఖ్యను చూసి మురిసిపోయిన బన్నీ.. ఇప్పుడు ట్రోలింగ్‌లో మునిగిపోతున్నాడు. దీనికి కారణం ఓ వీడియో పాడ్‌కాస్ట్‌.

Allu Arjun

అల్లు అర్జున్‌ని అందరూ ఐకాన్‌ స్టార్‌ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన చాలామందికి ఐకాన్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన యాటిట్యూడ్‌ విషయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే అది కొద్ది రోజులు, కొంతమందే. కానీ ఇటీవల ఓ పాడ్ కాస్ట్‌లో అల్లు అర్జున్ యాటిట్యూడ్ గురించి ఓ మీడియా మార్కెటింగ్‌ మహిళా ఉద్యోగి కొన్ని సంచలన విషయాలు చెప్పింది. అల్లు అర్జున్‌ని కలవాలి అంటే ఆయన టీమ్‌ తమకు 42 రూల్స్ పెట్టారని వెల్లడించింది. అందులో కొన్ని విషయాలు కూడా చెప్పింది.

ఆ వీడియో ఇలా వైరల్‌ అయిందో లేదో అల్లు అర్జున్‌ టీమ్‌ వెంటనే స్పందించింది. ఆమె చెప్పేవన్నీ అసత్యాలే అని ఆ ప్రకటనలో తేల్చేసింది. అంతేకాదు సదరు వ్యక్తులపై లీగల్ చర్యలు తీసుకుంటామని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వాళ్లపై పరువు నష్టం దావా వేయడానికి తమ లీగల్‌ టీమ్‌ పని చేస్తోందని కూడా ఆ పోస్టులో పేర్కొంది. మరోవైపు ఆ బ్రాండ్ వ్యూహకర్తతోపాటు, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయిపై ట్రోలింగ్ మొదలైంది. దీంతో ఆ వీడియోను తొలగిస్తున్నట్లు హోస్ట్‌ ప్రకటించింది.

బన్నీ టీమ్‌ ప్రకటన.. ఫాలోవర్లు చేసిన ట్రోలింగ్‌ ప్రభావమో కానీ అల్లు అర్జున్ పెట్టిన 42 కండిషన్స్ ఇవేనంటూ ఓ నోట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వాటిలో ఓ ట్విటర్‌ థ్రెడ్‌ చేసి, మీమ్ వీడియోస్‌ పెట్టి మరీ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. వాటిలో కొన్ని నమ్మేలా ఉంటే, మరికొన్ని నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఇప్పుడు వీటిపై కూడా కూడా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. తప్పుడు లిస్ట్ తయారుచేసిన వ్యక్తిని గుర్తించామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. చూస్తుంటే ఈ పంచాయితీ ఇప్పట్లో తేలేలా లేదు.

సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus