Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

సినిమా సినిమాకు మధ్యలో ఎక్కువ గ్యాప్‌ తీసుకోవడం నానికి అస్సలు నచ్చదు. అందుకే ఓ సినిమా సెట్స్‌ మీద ఉండగానే నెక్స్ట్‌ సినిమాల కథలను ఓకే చేస్తుంటారు. అందుకే వరుస సినిమాలు చేయగలుగుతున్నారు. మరోవైపు ఆయనకు కథలు రాయడానికి, చెప్పడానికి కొత్త కుర్రాళ్లు కూడా ఎప్పుడూ రెడీగానే ఉంటున్నారు. ఈ క్రమంలో నాని తన కొత్త సినిమా కోసం ఓ కథను దాదాపు ఓకే చేసేశాడు అని చెబుతున్నారు. విలక్షణ కథలకు, కుటుంబ నేపథ్య కొత్త కథలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారిన వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తారు అని చెబుతున్నారు.

Nani & Venky

ప్రస్తుతం సూర్యతో వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు ఇంకా పేరు అధికారికంగా చెప్పలేదు కానీ ‘విశ్వనాథం అండ్‌ సన్స్‌’ అనే పేరు అనుకుంటున్నట్లు సమాచారం. ఆ సినిమా అయిపోయాక వెంకీ.. తన కొత్త సినిమాను నానితో చేస్తారు అనేది టాలీవుడ్‌ లేటెస్ట్‌ టాక్‌. ఈ మేరకు ఇప్పటికే కథా చర్చలు జరిగాయి అని కూడా చెబుతున్నారు. అయితే సుజీత్‌ సినిమా తర్వాత ఇది ఉంటుంది అని అంటున్నారు. లేకపోతే రెండు ప్రాజెక్ట్‌లు పారలల్‌గా సాగుతాయని కూడా చెబుతున్నారు.

సుజీత్‌ సినిమా చాలా వరకు విదేశాల్లోనే ఉంటుందని సమాచారం. దీనికిగాను ఏప్రిల్‌లో లండన్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారట. మూడు నెలల లాంగ్‌ షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌ వచ్చేసి వెంకీ అట్లూరి సినిమా చేస్తారు అని చెబుతున్నారు. అప్పటికి సూర్య సినిమాను ఆయన పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. అయితే ఈ రెండు పడవల ప్రయణాన్ని నాని చేస్తారా అంటే.. గతంలో చేశారు అనే చెప్పుకోవాలి. మరి వెంకీ ఈసారి ఎలాంటి కథతో వస్తారో చూడాలి.

ఇక నాని ప్రస్తుతం చేస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. మార్చి ఆఖరి వారంలో సినిమాను తీసుకురావడం పక్కా అని మొన్నీమధ్య వరకు చెప్పిన టీమ్‌ వేరే సినిమాలు లేకపోతే వస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ తేదీకి ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌’ సినిమాను తీసుకొస్తున్నారు. కాబట్టి ‘ది ప్యారడైజ్‌’ ఆలస్యమవ్వడం ఖాయం అని చెప్పొచ్చు. ఆ ఆలస్యం ఇతర సినిమాల మీద ప్రభావం చూపిస్తుంది.

‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus