స్విస్ లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న బన్నీ!
- May 14, 2019 / 01:28 PM ISTByFilmy Focus
‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ చిత్రం తర్వాత బన్నీ నటించిన మరో చిత్రమేమీ విడుదల కాలేదు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందుతుంది. తండ్రికొడుకుల మధ్య సాగే ఓ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ క్రమంలో షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ తో స్విట్జర్లాండ్ కు ట్రిప్ కు వెళ్ళాడు బన్నీ. అక్కడ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అర్హ, అయాన్ లతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

- మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మహర్షి డైలాగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- నువ్వు తోపురావ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

స్విస్ లో మంచు కొండల ముందున్న ఓ స్టార్ రిసార్ట్ లో అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో స్టే చేస్తున్నాడు బన్నీ. బన్నీ ఫ్యామిలీ ట్రిప్ కు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వీటికి తెగ లైకులు వస్తున్నాయి. ఈ ఫోటోలో బన్నీ, స్నేహల జంట తమ బిడ్డలను ఎత్తుకుని ఫోజులిచ్చారు. ఏదేమైనా బన్నీ తన ఫ్యామిలీ తో కలిసి సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.


















