గంగోత్రి సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి అల వైకుంఠపురములో సినిమా వరకు అల్లు అర్జున్ ఎన్నో విజయాలకు సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రి విడుదలై నేటికి 18 సంవత్సరాలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు నటుడిగా అల్లు అర్జున్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్నారు. గంగోత్రి సినిమా విడుదలై 18 సంవత్సరాలు అయిన సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో అల్లు అర్జున్ తన తొలి చిత్రం గంగోత్రి విడుదలై 18 సంవత్సరాలైందని..
ఈ 18 సంవత్సరాల ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. తన హృదయమంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయిందని.. ఇన్ని సంవత్సరాలుగా అభిమానులు ప్రేమను కురిపిస్తున్నందుకు తాను ఎంతో లక్కీ అని అల్లు అర్జున్ వెల్లడించారు. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.
అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన అల్లు అర్జున్ భవిష్యత్ సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది ఆగష్టు నెల 13వ తేదీన పుష్ప సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కు జోడీగా ఈ మూవీలో రష్మిక మందన్న నటిస్తున్నట్టు తెలుస్తోంది.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!