Allu Arjun, Mahesh Babu: బన్నీ ఫ్యాన్స్ కు ఆ సైట్ షాకిచ్చిందా?

Advertisement

గతేడాది సంక్రాంతి పండుగ సమయంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలు రిలీజయ్యాయి. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రాగా సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సంక్రాంతి సమయంలో ఏ సినిమా పెద్ద హిట్ అనే విషయంలో ఇరు హీరోల ఫ్యాన్స్ గొడవ పడిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల కలెక్షన్ల పోస్టర్ల గురించి కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది.

అయితే ఐఎండీబీకి చెందిన బాక్సాఫీస్ మోజో అనే వెబ్ సైట్ ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా వరల్డ్ వైడ్ సినిమాల గ్రాస్ ను విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఆ సంస్థ అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 50 సినిమాల జాబితాను విడుదల చేసింది.ఈ జాబితాలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా 41వ స్థానాన్ని సొంతం చేసుకోగా అల వైకుంఠపురములో సినిమాకు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

మహేష్ మూవీనే హైయెస్ట్ గ్రాసర్ అని సరిలేరు నీకెవ్వరు ఇండస్ట్రీ హిట్ అంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే అల వైకుంఠపురములో సినిమా ఇండియా కలెక్షన్లు కలపకపోవడంతో ఆ సినిమాకు టాప్ 50 జాబితాలో చోటు దక్కలేదని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఆన్ లైన్ వార్ జరుగుతుండటం గమనార్హం.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus