అప్పుడు 6ప్యాక్…ఇప్పుడు 8ప్యాక్!!!

టాలీవుడ్ లో గంగోత్రి సినిమాతో కాస్త డీసెంట్ ఎంట్రీ ఇచ్చిన అల్లు వారి వారసుడు అల్లు అర్జున్ ఆ తరువాత అంచలంచెలుగా ఎదిగిపోయాడు. దాదాపుగా టాలీవుడ్ తపా హీరోస్ లో ఒకరిగా ఎదిగిన మన అల్లు అర్జున్, కొద్ది కాలంలోనే స్టైలిష్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా సూపర్ హిట్ డైరెక్టర్ బోయపాటితో సరైనోడు సినిమా చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.

ఇదిలా ఉంటే ఆ తరువాత మన బన్నీ ఎవరితో సినిమా చేస్తాడో అన్న అనుమానం కలగడంతో అందరూ బన్నీ పైనే ఫోకస్ పెట్టాడు, కాస్త గ్యాప్ తీసుకుని తన తరువాత సినిమా ‘హరీష్ శంకర్’ తో చేస్తున్నట్లు తెలిపాడు బన్నీ. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని బన్నీ పాత్రకు చాలా ఫిట్‌నెస్ అవసరం అవడంతో, వరుసపెట్టి వర్కౌట్స్ చేస్తున్నాడట మన అల్లు వారి వారసుడు. ఇక ఈ సినిమా బన్నీ 8ప్యాక్ తో కనిపించి అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడు అని టాలీవుడ్ టాక్.

ఈ విషయం అధికారికంగా బయటకు రాకపోయినా…క్రిష్ పెళ్లి, ఫ్రెండ్‌షిప్ దాయ్ రోజు, ఆతరువాత బన్నీ కొనిపించిన కొన్ని ఇవెంట్స్ లో గెటప్ చూస్తే ఇదే అనిపించక మానదు. ఫిట్నెస్‌లు చేసి చేసీ అల్లు అర్జున్ బాడీని బాడీ లాంగ్వేజ్ ని కంట్రల్ చేసేసిన తీరు చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. అయినా..మన వాడు స్టైల్ కే మారుపేరు, ఏమాత్రం లేకపోతే ఎలా…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus