Allu Arjun, David Warner: పుష్ప2 స్టెప్ పై డేవిడ్ వార్నర్ కామెంట్.. బన్నీ రియాక్షన్ ఇదే!

ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా డైలాగ్స్, సాంగ్స్ పై రీల్స్ చేయడం ద్వారా పాపులర్ అయిన డేవిడ్ వార్నర్ కు పుష్ప ది రైజ్ రీల్స్ మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule) సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ గురించి డేవిడ్ వార్నర్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. బన్నీ ఇన్ స్టాగ్రామ్ లో ఫస్ట్ సింగిల్ హూక్ స్టెప్ ను షేర్ చేయగా డేవిడ్ ఆ సాంగ్ గురించి రియాక్ట్ కావడం జరిగింది.

“ఈ డ్యాన్స్ స్టెప్ ఎంత బాగుందో.. ఇప్పుడు నాకు మళ్లీ పని పడింది.. ఈ స్టెప్ ను నేర్చుకోవాలి” అంటూ కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ తన దృష్టికి రావడంతో బన్నీ (Allu Arjun)   స్పందిస్తూ “ఇది చాలా ఈజీ.. ఈసారి మనం కలిసినప్పుడు నేను నేర్పిస్తాను” అంటూ సమాధానం ఇచ్చారు. బన్నీ అలా స్పందించడంతో వార్నర్ కు ఈ స్టెప్ చాలా సులువు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ సైతం వైరల్ అవుతున్నాయి.

డేవిడ్ వార్నర్ కొన్ని కొన్ని వారాల క్రితం ఒక యాడ్ లో కూడా నటించి మెప్పించారు. భవిష్యత్తులో డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలలో నటించి మెప్పించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు మరో 100 రోజుల సమయం మాత్రమే ఉంది. పుష్ప ది రూల్ సినిమాలో డేవిడ్ వార్నర్ తో క్యామియో రోల్ చేయించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పుష్ప ది రూల్ సినిమాలో రష్మిక (Rashmika Mandanna,) , ఫహద్ ఫాజిల్ (Fahadh Fasil) పాత్రలు మరింత ప్రత్యేకంగా ఉంటాయని ఈ పాత్రలకు సంబంధించిన ట్విస్టులు ఆకట్టుకునేలా ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus