Pushpa 2 First Song: ‘పుష్ప2’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Advertisement

అల్లు అర్జున్ (Allu Arjun)  – సుకుమార్ (Sukumar)  కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2’ (Pushpa 2: The Rule). మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని , వై.రవి శంకర్.. లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగం ‘పుష్ప’ ( ది రైజ్) సూపర్ హిట్ అయ్యింది. హిందీలో కూడా బాగా ఆడింది. దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతంలో రూపొందిన పాటలు కూడా నార్త్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయి.

సోషల్ మీడియాలో ఆ పాటలకు వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. దీంతో పుష్ప 2 మ్యూజిక్ పై కూడా ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. అయితే ఇటీవల రిలీజ్ అయిన ‘ పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్ ‘ అనే లిరికల్ ప్రోమోకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ‘ఫుల్ సాంగ్ బాగుంటుందేమోలే’ అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘పుష్ప‌… పుష్ప‌…పుష్ప.. పుష్ప‌రాజ్.. నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే.. దేశం ద‌ద్ద‌రిలే’ అంటూ సాంగ్ మొదలైంది. చంద్రబోస్ అందించిన లిరిక్స్ పుష్ప క్యారెక్టరైజేషన్ ను మరోసారి గుర్తుచేసే విధంగా ఉన్నాయి. అయితే ట్యూన్ ఎక్కడో తేడా కొట్టింది. ‘జై లవ కుశ’ లో ‘రావణ జై జై జై ‘ అనే పాటను గుర్తు చేసింది ఈ ట్యూన్. అయితే ఇది కూడా సిట్యువేషన్ సాంగ్ అయ్యి ఉండొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus