ఏప్రిల్ నెల టాలీవుడ్ ప్రోగ్రెస్.. మరీ ఇంత డల్ ఏంటి..!

2023 సమ్మర్లో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ నాని (Nani) నటించిన ‘దసరా’ (Dasara) సాయి దుర్గా తేజ్ (Sai Dharam Tej) ‘విరూపాక్ష’ (Virupaksha) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు పడ్డాయి. మే ఎండింగ్ వరకు ఆ సినిమాలు థియేటర్లలో అలాగే ఓటీటీల్లో ఎంగేజ్ చేశాయి. అలాగే అఖిల్ (Akhil Akkineni) నటించిన ‘ఏజెంట్’ (Agent) , గోపీచంద్ (Gopichand) నటించిన ‘రామబాణం’ (Ramabanam) , నాగ చైతన్య (Naga Chaitanya) ‘కస్టడీ’ (Custody) వంటి క్రేజీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఈ ఏడాది సమ్మర్ కి అలాంటి అవకాశం కూడా లేకుండా పోయింది.

‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) మినహా పెద్ద హిట్ సినిమాలు ఏవీ ఈ మార్చ్, ఏప్రిల్ లో రాలేదు. ఏప్రిల్ లో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ (The Family Star) నిరాశపరిచింది. సో ఈ సమ్మర్ మరింత డల్ గా ఉండబోతుందనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. మరోపక్క ఏప్రిల్లో ‘ఫ్యామిలీ స్టార్’, ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ (Geethanjali Malli Vachindhi)  ‘రత్నం’ (Rathnam) (డబ్బింగ్) ఇలా.. మొత్తంగా 40 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. ఇందులో ఒక్క మలయాళం సూపర్ హిట్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ మాత్రమే నామ మాత్రపు హిట్ గా నిలిచింది.

మిగిలిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అయ్యింది లేదు. అన్నీ ఎలా ఉన్నా ప్రేక్షకులు కూడా ఇప్పుడు థియేటర్స్ కి రావడానికి ఇంట్రెస్ట్ లేదు అని స్పష్టమవుతుంది. ఓ పక్క ఎన్నికలు, ఇంకో పక్క ఐపీయల్ హడావుడి ఉండటం.. మరోపక్క ఎండలు మండిపోవడంతో జనాలు ఇళ్లకే పరిమితమవుతున్నారు అని కూడా కొందరి అభిప్రాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus