సపరేట్ ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నాడో క్లారిటీ ఇచ్చిన బన్నీ

  • January 16, 2020 / 01:45 PM IST

అల్లు అర్జున్ ఇటీవల కొత్త ఆఫీస్ మొదలెట్టడంతోపాటు.. సపరేట్ గా కొత్త ఇల్లు కట్టుకోవడానికి భూమి పూజ చేయగానే.. బన్నీ వేరు పడుతున్నాడు అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. బన్నీకి, అల్లు అరవింద్ కి ఈమధ్య పడడం లేదని.. ఇద్దరికీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తున్నాయని అందుకే అల్లు అర్జున్ సపరేట్ ఇల్లు, ఆఫీసు అంటూ వేరుపడుతున్నాడని సదరు రూమర్ల పరమార్ధం. అయితే.. ఈ విషయమై బన్నీ స్పందించాడు. ఆల్రెడీ “అల వైకుంఠపురములో” ప్రీరిలీజ్ ఈవెంట్లో తన తండ్రి అల్లు అరవింద్ పట్ల తనకు ఉన్న ప్రేమను, అభిమానాన్ని ఘనంగా చాటుకున్నా బన్నీ.. ఈ రూమర్లపై నవ్వేశాడు.

 

“గీతా ఆర్ట్స్ లో ఇప్పటికే చాలా సినిమాల ప్రొడక్షన్ జరుగుతోంది. అక్కడ నాకంటూ పర్సనల్ స్పేస్ లేకుండాపోయింది. అక్కడ పని చేసుకుంటున్నవాళ్లని డిస్టర్బ్ చేయడం నాకు నచ్చదు. అందుకే సపరేట్ ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాను కానీ.. వేరు పడాలన్న ఆలోచన నాకు ఏమాత్రం లేదు. ఇక కొత్త ఇల్లు అంటారా.. ఒక లావిష్ బంగ్లాలో ఉండాలనేది నా కల.. అందుకే ఇప్పటివరకూ ఎలాంటి హీరోకి లేని ఒక బంగ్లా కట్టుకుంటున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చాడు బన్నీ.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus