Allu Arjun, Allu Arha: హ్యాపీ బర్త్ డే లిటిల్ ప్రిన్సెస్.. బన్నీ పోస్టు వైరల్!

Advertisement

అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇంత చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక అర్హకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. తన తల్లి స్నేహ రెడ్డి అలాగే అల్లు అర్జున్ ఇద్దరు కూడా అర్హ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెకు అభిమానుల సంఖ్య పెరిగిపోయింది.

ఇక ఇంత చిన్న వయసులోనే ఈ చిన్నారి బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈమె సమంత నటించిన శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటించారు. ఇలా బాలనటిగా కూడా తన నటనతో అందరిని మెప్పించింది. ఇకపోతే అల్లు అర్హ నేడు ఏడవ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుమార్తెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

వరుణ్ పెళ్లిలో దిగినటువంటి ఫోటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నా లిటిల్ ప్రిన్సెస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈయన తన కూతురికి చాలా క్యూట్ గా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలతో పాటు తన కూతురితో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని కూడా అల్లు అర్జున్ షేర్ చేశారు.

ఈ విధంగా (Allu Arha) అల్లు అర్హ పుట్టినరోజు కావడంతో ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిన్నారి అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పనులలో బిజీ కానున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus