Allu Ayaan: అల్లు అర్జున్ కొడుకులో ఈ టాలెంట్ కూడా ఉందా?

  • January 7, 2023 / 01:37 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఎంత ప్రతిభ ఉన్న నటుడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అని ఆడియన్స్ భావిస్తారు. వరుస విజయాలతో జోరుమీదున్న బన్నీ పుష్ప2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బన్నీ స్నేహారెడ్డి క్యూట్ జోడీ కాగా ఈ దంపతుల పిల్లలైన అయాన్, అర్హలకు కూడా సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే స్నేహారెడ్డి కొడుకు అయాన్ సహాయంతో వంట చేస్తుండగా అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. స్నేహారెడ్డికి సాయం చేయడం కోసం అయాన్ కూరగాయలను కట్ చేశారు. అయాన్ ను ఈ విధంగా చూసిన నెటిజన్లు అయాన్ చాలా క్యూట్ అని వర్కహాలిక్ అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఐకాన్ స్టార్ ను కష్టపెట్టొద్దంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయాన్ వర్క్ కు ఫిదా అయ్యామని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అల్లు అయాన్ సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శాకుంతలం సినిమాతో అల్లు అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమాలో భరతుని పాత్రలో అల్లు అర్హ కనిపించనున్నారు. శాకుంతలంతో అర్హ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సుకుమార్ అల్లు అర్జున్ కు మరో ఇండస్ట్రీ హిట్ ఇవ్వబోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బన్నీ కెరీర్ లో పుష్ప2 స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప1 తో పోల్చి చూస్తే మరిన్ని ప్రత్యేకతలు ఉండే విధంగా పుష్ప2 సినిమా ఉండనుందని సమాచారం అందుతోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus