Pushpa 2′: సెన్సేషనల్‌ బీజీఎం రెడీ చేస్తున్నారట… హెడ్ ఫోన్స్‌ కొత్తవి కావాలేమో!

Advertisement

అల్లు అర్జున్‌ పుట్టినరోజులు ఇన్నాళ్లూ ఒక లెక్క… ఇప్పుడు ఇంకో లెక్క. ఎందుకంటే ఈ సారి పుట్టిన రోజుకు ‘పుష్ప’రాజ్‌ మళ్లీ వస్తున్నాడు. ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2)  సినిమా నుండి ఈ నెల 8న స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉంటుంది అని టీమ్‌ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ఓ టీజర్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఆ పోస్టర్‌తోనే హైప్‌ ఓ రేంజిలో ఎక్కితే… ఇప్పుడు అంతకుమించి ఉంటుంది అంటూ మరో హైప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది చిత్రబృందం.

సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌ చేస్తాం అని టీమ్ ఇప్పటికే చెప్పింది. అంటే మరో నాలుగు నెలలు ఉంది. అయినా బన్నీ జన్మదినాన్ని మించిన రోజు లేదు అనుకుంటూ సినిమా ప్రచారాన్ని షురూ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రచారం ఉండకపోయినా ఈ నెల 8 నుండి ఏదో రకంగా సినిమా గురించి బయట మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేస్తోందట. సెన్సేషనల్‌ మ్యూజిక్‌తో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) కూడా సిద్ధమయ్యారట.

సుకుమార్‌, అల్లు అర్జున్‌ (Allu Arjun), దేవిశ్రీ ప్రసాద్‌ కలిసి దిగిన ఓ ఫొటోను మైత్రీ మూవీ మేకర్స్‌ షేర్‌ చేస్తూ… ‘హెడ్‌ఫోన్స్‌ రెడీ చేసుకోండి. ‘పుష్ప2’ టీజర్‌కు సెన్సేషనల్‌ బీజీఎం రాబోతోంది’ అని రాసుకొచ్చింది. దానికి బన్నీ అభిమానులు ‘కొత్త హెడ్ ఫోన్స్‌ కొనుక్కుంటాం… మ్యూజిక్‌తో దద్దరిల్లేలా చేయాలి’ అని కామెంట్లు చేస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో పాటలు ఏ స్థాయిలో హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకుమించి ఉండేలా చూసుకుంటున్నారట.

‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa: The Rise) సినిమాలో అన్ని పాటలు కుర్రకారు నోళ్లలో నానాయి. ఇక సెలబ్రిటీలు సైతం ఆ పాటలకు రీల్స్‌ చేసి సందడి చేశారు. క్రీడా మైదానాల్లో కూడా ఆ పాటలకు స్టెప్పులు ఇప్పటికీ వేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సినిమాకు సీక్వెల్‌గా వచ్చే సినిమాలో ఇంకెలాంటి పాటలు ఉంటాయో, ఎంతటి సందడి చేస్తాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags