బన్నీకి పాపం మరో ఏడాదిన్నర గ్యాప్ పడిందిగా..!

  • July 8, 2020 / 10:00 AM IST

బన్నీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో తనపై తానే సెటైర్ వేసుకున్నాడు . తండ్రి పాత్రలో ఉన్న మురళి శర్మ ‘ఏంటిరా గ్యాప్ ఇచ్చావ్ అంటే…’ బన్నీ దానికి సమాధానంగా ‘గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది…’ అని చెవుతాడు. నాపేరు సూర్య మూవీ విడుదల తరువాత బన్నీ దాదాపు ఏడాదిన్నర పాటు గ్యాప్ మరో చిత్రం చేయలేదు. దీనిపై తను కావాలని గ్యాప్ తీసుకోలేదని, కొన్ని కారణాల వలన తీసుకోవలసి వచ్చిందని బన్నీ తెలియజేశాడు.

ఈ డైలాగ్ మరో మారు బన్నీకి సూట్ అవుతుంది. పుష్ప విషయంలో ఆయన గ్యాప్ తీసుకోక పోయిన కరోనా వైరస్ వలన గ్యాప్ తీసుకోవలసి వస్తుంది. లాక్ డౌన్ దెబ్బకు పుష్ప రిలీజ్ డేట్ లో భారీ తేడా రానుంది. ఏప్రిల్ నుండి బన్నీ పుష్ప షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అప్పటికే ఓ షెడ్యూల్ కేరళలో పూర్తి చేసిన సుకుమార్..నెక్స్ట్ షెడ్యూల్ సైతం కేరళలో ప్లాన్ చేశారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నాలుగు నెలలుగా షూటింగ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.

సుకుమార్ ఏకంగా షూటింగ్ లొకేషన్ మార్చివేసినట్లు వార్తలు వస్తున్నాయి. కేరళ అడవులకు బదులు నల్గొండ ఫారెస్ట్ లో పుష్ప నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మూవీ షూటింగ్ ఓ నెలలో మొదలైనా..విడుదల మాత్రం 2021 సమ్మర్ లోనే. అంటే మరో మారు బన్నీ ప్రమేయం లేకుండా ఏడాదిన్నర గ్యాప్ రానుందన్న మాట. ఆ విధంగా బన్నీ కి మరో మారు బారి గ్యాప్ రానుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus