పుష్ప 1&2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీ తో దాదాపుగా నార్త్ ఇండియా మొత్తం బన్నీ హవా మొదలైనది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇప్పటికే బన్నీకి సౌత్ ఇండియాలో మన తెలుగు స్టేట్స్ తో పాటు కేరళ & కర్ణాటకలో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీస్ లైనప్ చూసినట్లయితే అందరి నోటా ఒకటే మాట వినిపిస్తుంది. అదేంటంటే..
పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మూవీ లైనప్ లో భాగంగా AA 22 కు తమిళ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండగా, ఆ తదుపరి చిత్రం AA 23 తమిళ్ సెన్సషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు, కాగా ఈ మూవీకి మ్యూజిక్ సంచలనం అనిరుద్ స్వరాలూ అందిస్తున్నారు. రీసెంట్ గానే సంక్రాంతి సందర్భంగా AA 23 కి సంబందించిన క్రియేటివ్ వీడియో ఒకటి విడుదల చేసి మూవీ ని కన్ఫర్మ్ చేసారు చిత్ర యూనిట్. ఇదంతా చూస్తుంటే బన్నీ ఒక ప్లాన్ ప్రకారమే తమిళ్ స్టార్ డైరెక్టర్స్ తో వరుస సినిమాలు ప్లాన్ చేసి, తన మూవీస్ తో తమిళ్ ఆడియన్స్ ని డైరెక్ట్ గానే టార్గెట్ చేసాడు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తున్న టాక్. బన్నీ వర్క్ చేస్తున్నది కూడా బడా దర్శకులు మరియు నిర్మాణ సంస్థలు అవ్వటంతో తమిళనాట పెద్ద ఎత్తున విడుదలతో బన్నీ ప్లాన్ సక్సెస్ అవ్వబోతోందని కొన్ని వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.