డిసెంబరులో ‘పుష్ప’రాజ్ (Pushpa 2: The Rule) వచ్చేది లే.. అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమా టీమ్‌లో కీలక సభ్యునికి ఎవరికో ఆరోగ్యం బాగాలేదని, సుకుమార్ అర్జెంట్‌గా విదేశాలకు వెళ్లారని, బన్నీ కూడా ఓ ట్రిప్ వేస్తున్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఈ నేపథ్యంలో చిత్రబృందం నుండి ఓ క్లారిటలీ వచ్చింది. అయితే ఇది అధికారిక నోట్‌లా కాకుండా సమాచారంలా ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే.. ఇప్పుడు షూటింగ్‌కి ‘పుష్ప’రాజ్ రెడీ.. కానీ బన్నీ కాదట.
అదేం ట్విస్ట్ అనుకుంటున్నారా. ఈ సినిమా షూటింగ్‌లో కొత్త షెడయూల్ త్వరలో ప్రారంభిస్తారట. అయితే బన్నీ (Allu Arjun) మాత్రం షూటింగ్‌లో పాల్గోడట. ఈ విషయం చెబుతూనే పుకార్లు వస్తున్నట్లు సినిమా యూనిట్‌లో పరిస్థితులు పుకార్లలో చెబుతున్నంత తీవ్రంగా లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన కుమార్తె చదువు, కాలేజీకి పనుల గురించి కుటుంబంతో సుకుమార్ (Sukumar) యుఎస్ వెళ్లారని అంటున్నారు. ఈ గ్యాప్ రావడంతో అల్లు అర్జున్ గడ్డం తగ్గించి ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడని చెబుతున్నారు.
సుకుమార్ ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగు పెట్టేయగా.. బన్నీ కూడా వచ్చేస్తున్నాడని అంటున్నారు. అయితే కంటిన్యూటీ కోసం గెడ్డం పెంచేంతవరకు బన్నీ షూట్‌లో పాల్గొనడట. అంతా ఓకే అనుకున్నంతవరకు మిగిలిన పనులు టీమ్ చేసుకుంటుంది అని చెబుతున్నారు. అల్లు అర్జున్ వరకు చూస్తే.. క్లైమాక్స్ ఫైట్, ఒక పాట మాత్రమే మిగిలి ఉన్నాయట. అందుకే మిగిలిన సీన్స్, కొంత పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని బన్నీ వచ్చాక ఆయన మీద సన్నివేశాలు తెరకెక్కిస్తారట.
ఆ లెక్కన డిసెంబరు 6కు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘పుష్ప 2’ థియేటర్లలోకి వస్తుందని పక్కాగా చెబుతున్నారు. మరి చెప్పినట్లే జరుగుతుందా? పుకార్లు పుకార్లుగానే మిగిలి ఆ రోజుకు సినిమా వచ్చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే ఆగస్టు 15 నుండి డిసెంబరుకు సినిమా వెళ్తుంది అని గతంలో ఇలానే పుకార్లు వస్తే ఖండించిన టీమ్.. తర్వాత అదే జరిగింది కూడా. కాబట్టి ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.