Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

‘కన్నె పెట్టరో కన్ను కొట్టరో..’ అని ‘డెకాయిట్‌’ సినిమా ప్రమోషనల్‌ వీడియోలో ఉందని కన్ను కొట్టాడో.. లేక సరదాగా కన్నుకొట్టాడో కానీ అల్లు అర్జున్‌ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మృణాల్‌ ఠాకూర్‌ తనకు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫ్లవర్‌ బొకే, గ్రీటింగ్‌ కార్డు పంపిందనే విషయాన్ని చెబుతూ అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు. వాటిని పంపించినందుకు థ్యాంక్స్‌ చెప్పాడు. ఈ క్రమంలో పోస్ట్‌ ఆఖరున ‘నీతో ఏదో ఒక రోజు కలసి పని చేస్తా’ అని రాసుకొచ్చాడు. అక్కడి వరకు ఓకే.. ఆ తర్వాత కన్నుకొట్టిన ఎమోజీ పెట్టాడు.

Allu Arjun – Mrunal

మామూలుగా అయితే సరదాగా కన్ను కొట్టాడు అనుకోవచ్చు. కానీ అట్లీతో బన్నీ చేస్తున్న సినిమాలో మృణాల్‌ నటిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అలా కన్ను కొట్టడం ‘ఆ సినిమాలో ఆమె ఉందని’ చెప్పడమే అంటున్నారు నెటిజన్లు. కావాలనే బన్నీ అలా టీజ్‌ చేశాడు అనేది వారి డౌట్‌. బన్నీ తన సినిమాల గురించి ఇలా టీజింగ్‌లు ఇవ్వడం చాలా రోజుల నుండి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా అదే చేశాడు అని అంటున్నారు. ఇందులో నిజం తెలియాలంటే ఆమె షూటింగ్‌ పార్ట్‌ మొదలవ్వాలి. ఇప్పుడు ఇతర హీరోయిన్ల సీన్స్‌ ముంబయిలోని ఓ స్టూడియోలో తెరకెక్కిస్తున్నారట.

బన్నీ సరదాగా కన్ను కొట్టాడు అనే అనుకుందాం. ఏ పరిచయం ఉందని మృణాల్‌ ఇప్పుడు అతని ఫ్లవర్‌ ఒకే పంపిస్తుంది. కచ్చితంగా సినిమాలో నటించిన / నటించబోయిన పరిస్థితుల కారణంగానే అంటున్నారు నెటిజన్లు. అన్నట్లు ఈ మధ్య మృణాల్‌ను ఈ సినిమా గురించే అడిగితే.. ఇప్పటివరకు అయితే ఏమీ లేదు. అలాంటి అవకాశం రావాలి అని నేనూ కోరుకుంటున్నాను అని చెప్పింది. అంటే ఆమె అటు ఇటు కాకుండా చెప్పింది. ఇటు బన్నీ కూడా ఏటూ కాకుండా లీక్‌ ఇచ్చాడు. చూద్దాం ఏప్రిల్‌ 8న టీజర్‌ వచ్చినప్పుడు ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు.

డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus