Taapsee: డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

నోరు జారనేల.. కవర్‌ చేయనేల అంటారు పెద్దలు. అంటే అవకాశం దొరికింది కదా అని ఏదేదో మాట్లాడేసి.. ఆ తర్వాత డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం మంచి మాటలు చెప్పడం ఎందుకు అని. ఈ మాట ఇప్పుడు ప్రముఖ కథానాయిక, రెబల్‌గా పేరొందిన తాప్సి పన్నును చూస్తూ అర్థమవుతోంది. తెలుగులో గ్లామర్‌ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా సినిమాలు చేసి స్టార్‌ స్టేటస్‌ అందుకుని, ఆ తర్వాత ఇక్కడ నిలదొక్కుకోలేక బాలీవుడ్‌ వెళ్లిపోయింది తాప్సి. అక్కడికి వెళ్లినప్పటి నుండి తెలుగు సినిమాల గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటోంది.

Taapsee

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం టాలీవుడ్‌ గురించి కొన్ని విమర్శలు చేసింది. సౌత్‌ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఒక సినిమా టీమ్‌ ప్యాడెడ్‌ బ్రా వేసుకోమందని ఆమె కామెంట్ల సారాంశం. గ్లామర్‌ సన్నివేశాలు, పాటలకు సంబంధించి మరింత ఆకర్షణీయంగా కనిపించాలని ప్యాడెడ్ బ్రా ధరించాలని సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ తనపై ఒత్తిడి తెచ్చేవారని ఆరోపించారు. ఈ కామెంట్లపై పెద్ద విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇప్పుడు తాప్సి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తెలుగు సినిమాను పొగిడేసింది.

ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ తనకు పర్ఫామెన్స్ పరంగా కోలీవుడ్ సినిమా పరిశ్రమ వల్ల పెద్దగా ఒరిగింది ఏమి లేదు అని.. తెలుగు సినిమా వల్ల ఆదరణ ఎక్కువ వచ్చిందని టాలీవుడ్‌ని నెత్తిన పెట్టుకునే పని చేసింది. తెలుగు సినిమాలో నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే పాత్రలు ఉంటాయి. తమిళంలో అలాంటివి తక్కువ. టాలీవుడ్‌ అందించినన్ని మంచి పాత్రలు తమిళ సినిమా ఇవ్వలేదు. తెలుగు ప్రేక్షకులకు నేనంటే అభిమానం. టాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు నా విలువని పెంచాయి అని పొగిడేసింది.

ఆమె చెప్పింది నిజమే అయినా.. రీసెంట్‌ కామెంట్స్‌ డ్యామేజ్‌కి కంట్రోల్‌లానే ఆమె మాటలు అనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన తాప్సీ సౌత్‌లో నటించడం వల్ల తనకు తగిన గుర్తింపు రాలేదని కొన్ని రోజుల క్రితం కామెంట్స్‌ చేసింది. ఆమె సినిమాల సంగతి చూస్తే.. ‘ఝుమ్మంది నాదం’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. టాలీవుడ్‌లో ఆమె ఆఖరి సినిమా 2022లో వచ్చిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’.

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus