‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇదే ఆనందంలో ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ పెట్టి… మరింతగా ఈ సినిమాని పుష్ చేయాలని భావించారు మేకర్స్. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో నిర్మాతలు, హీరో… పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ (Allu Arjun) ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ నంబర్లు అనేవి తాత్కాలికం మాత్రమే. కానీ ఈ నెంబర్లు చూసినప్పుడు నాకు ఆడియన్స్ ప్రేమ కూడా కనపడుతూ ఉంటుంది.
వాళ్ళ ప్రేమనే సూచిస్తూ ఉంటాయి ఈ నంబర్స్. కానీ వచ్చే ఏడాది ఏప్రిల్, మే టైంకి మా ‘పుష్ప 2’ నంబర్స్ బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలా బ్రేక్ అయితేనే మన ఇండియన్ సినిమా ఎదుగుతున్నట్టు అర్థం. ‘పుష్ప 2′ ని ఇంత పెద్ద హిట్ చేసిన ఇండియా వైడ్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
‘ఆ తర్వాత ఇండియాలో 38 కోట్ల మంది భర్తలు ఉన్నారు. వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి?’ అంటూ అల్లు అర్జున్..ని ప్రశ్నించాడు యాంకర్. ఇందుకు అల్లు అర్జున్.. ‘ఆ 38 కోట్ల మంది భర్తలు పెళ్ళాల మాట వినాలి అని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘పుష్ప 2’ సినిమాలో పుష్ప రాజ్… పెళ్ళాం మాట వినడం వల్ల ముఖ్యమంత్రినే మార్చేసే రేంజ్ కి వెళ్తాడు. ఆ సీన్స్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి.