Rajinikanth Birthday Special: రజనీకాంత్‌ @ 74… ఈ 18 విషయాలు మీకు తెలుసా?

ప్రముఖ నటుడు, తలైవా, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) పుట్టిన రోజు నేడు. ‘భారతీయ చిత్రసీమ ఇలాంటి నటుడు మరొకరు ఉండరు’ అని చెప్పుకోదగ్గ నటుల్లో ఒకరైన తలైవా స్పెషల్‌ డే నాడు కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం. ఇందులో మీకు కొన్ని తెలిసి ఉంటాయి. ఇంకొన్ని కొత్తగా ఉండొచ్చు కూడా.

Rajinikanth Birthday Special

 

* కర్ణాటకలోని మరాఠీ హిందూ కుటుంబానికి చెందిన రజనీకాంత్‌ తమిళనాడులో స్థిరపడ్డారు. ఆయన తండ్రి రామోజీరావు గైక్వాడ్‌ పోలీసు కానిస్టేబుల్‌.

* రజనీకి చిన్నతనంలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ అంటే చాలా ఇష్టమట. దాంతోపాటు చిన్నతనంలో తుంటరితనం ఎక్కువగా ఉండేదట. దీంతో ఆయన్ను రామకృష్ణ మిషన్‌లో చేర్పించారు.

* చిన్నతనంలో అక్కడ నాటకాలు కూడా వేశారు తలైవా. మహాభారతంలో ఏకలవ్యుడు స్నేహితుడి పాత్రలో నటించారు. ఈ క్రమంలో ప్రముఖ కన్నడ కవి డీఆర్‌ బింద్రే దృష్టిలో పడ్డారు.

* రజనీకాంత్‌ సినిమాల్లోకి వచ్చే ముందు బస్ కండక్టర్‌గా పని చేశారు అని చాలామందికి తెలుసు. అయితే అంతకంటే ముందు ఆయన కూలీగా, కార్పెంటర్‌గా కూడా పని చేశారు.

* 170 సినిమాల్లో ఇప్పటివరకు నటించిన రజనీ.. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాళీ, మలయాళంలో నటించారు.

* 1978లో కెరీర్‌ను ప్రారంభించిన రజనీ.. తొలినాళ్లలో విలన్‌గా నటించారనే విషయం తెలిసిందే. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20కిపైగా సినిమాల్లో విలన్‌గా కనిపించి మెప్పించారు.

* రజనీని సూపర్‌స్టార్‌ అని అంటారనే విషయం మీకు తెలిసి ఉండొచ్చు. మరి ఆ ట్యాగ్‌ ఏ సినిమాతో వచ్చిందో తెలుసా? 1978లో వచ్చిన ‘భైరవి’తో రజనీ.. సూపర్‌ స్టార్‌ రజనీ అయ్యారు.

* తమిళంలో తొలి సినిమా ‘అపూర్వ రాగంగళ్‌’ కాగా, కన్నడలో ‘కథ సంగమ’, ‘తెలుగులో ‘అంతులేని కథ’, బెంగాళీలో ‘భాగ్య దేవత’, హిందీలో ‘అంధా కనూన్‌’. గెస్ట్‌ అప్పీయరెన్స్‌గా తొలి సినిమా తెలుగు సినిమా ‘ఆమె కథ’.

* రజనీకాంత్‌ గురించి సీబీఎస్‌ఈ పాఠ్య పుస్తకాల్లో ఓ పాఠం ఉందని తెలుసా? దాని ‘ఫ్రమ్‌ బస్‌ కండక్టర్‌ టు ఫిల్మ్ స్టార్‌’. ఈ ఘనత దక్కించుకున్న ఏకైన ఇండియన్‌ యాక్టర్‌ మన తలైవా.

* రజనీ సినిమాల్లో నటించడమే కాదు పాడతారు, రాస్తారు కూడా. ‘వల్లి2, ‘బాబా’ (BABA) సినిమాలకు ఆయన స్క్రీన్‌ రైటర్‌. ఇక ‘మన్నన్‌’, ‘కోచ్చడయాన్‌’లో (Kochadaiiyaan) పాటలు కూడా పాడారాయన.

* ఇక ఆయన్ను వరించి మురిసిపోయిన అవార్డుల సంగతి చూస్తే.. 2019లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చింది. 2000లో పద్మ భూషణ్‌ రాగా.. అక్కడికి 16 ఏళ్ల తర్వాత పద్మ విభూషణ్‌ ఇచ్చారు.

* ఫోర్బ్స్‌ సంస్థ 2010లో మన దేశంలోనే అత్యంత ప్రభావిత వ్యక్తిగా రజనీకాంత్‌ పేరును ప్రకటించింఇ. దక్షిణ ఆసియాలో ఈ గౌరవం అందుకున్న వ్యక్తి రజనీ అని ఏసియా వీక్‌ కూడా చెప్పింది.

* ఇక రాజకీయాల్లోకి రావాలి అనేది రజనీకాంత్‌ ఏళ్ల నాటి కోరిక. తొలుత 1995లో ఆ ప్రయత్నాలు చేశారు. కానీ యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేయలేదు. జయలలితకు (Jayalalitha) వ్యతిరేకంగా డీఎంకేకి సపోర్టు చేశారు. ఓటు వేయమని కూడా కోరారు. 2004లో బీజేపీకి సపోర్టు చేశారు.

* 2017లో యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి వస్తా అని చెప్పారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అని కూడా చెప్పారు. రజనీ మక్కళ్‌ మండ్రమ్‌ అనే పార్టీ కూడా పెట్టారు. కానీ అనూహ్య రీతిలో రాజకీయాల నుండి తప్పుకున్నారు.

* రజనీ భార్య లత పరిచయం గమ్మత్తుగా జరిగింది అంటారు. కాలేజీ స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ఆమె రజనీని ఇంటర్వ్యూ చేశారట. ఆ పరిచయం ప్రేమగా మారి, పెళ్లి అయిందట.

* రజనీకాంత్‌ ఓ ఇంగ్లిష్‌ సినిమాలోనూ నటించారని తెలుసా? 1988లో ‘బ్లడ్‌ స్టోన్‌’ అనే సినిమాలో శ్యామ్‌ బాబు అనే పాత్రను పోషించారు. డ్విట్‌ హెచ్‌ లిటిల్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్నే అందుకుంది.

* ఆయన సినిమా ‘ముత్తు’ను మన దేశంలోనే కాదు జపాన్‌లోనూ ఆదరించారనే విషయం తెలిసిందే. ఆ సినిమాకు అక్కడ ‘ముత్తు: ఒడొరు మహారాజ’ అనే పేరు పెట్టారు.

* మామూలుగా హీరోలు తమ సొంత పేరుతో కొన్ని సినిమాలు చేస్తుంటారు. కానీ రజనీకాంత్‌ కేవలం ఒకే ఒక సినిమా చేశారు. అదే ‘శివాజీ: ది బాస్‌’.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags