ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయ్యింది… అంత టి.ఆర్.పి రేటింగ్ వస్తుందా…?

ఈ సంక్రాంతి సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అల్లు అర్జున్ … ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మహేష్ బాబు … నువ్వా నేనా అన్నట్టు తలబడ్డారు. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అయితే ఫ్యామిలీ సినిమాతో వచ్చాడు కాబట్టి బన్నీ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఏకంగా ఈ చిత్రంతో 161 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మాత్రం 138 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది.

ఫస్ట్ లుక్ దగ్గర నుండీ సినిమాలు ఫుల్ రన్ ముగిసి ఆన్లైన్ లో విడుదల అయ్యేంత వరకూ ఈ రెండు సినిమా టీం లు పోటీపడుతూనే వచ్చారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే… ఆన్లైన్ లో మాత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్రం కంటే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి ఎక్కువ ఆదరణ దక్కుతుండడం విశేషం. ఇక ఈ మధ్యే ‘సరిలేరు’ చిత్రాన్ని జెమినీ టీవీ వారు ప్రసారం చెయ్యగా ఏకంగా 23.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.

ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని కొనుగోలు చేసిన జెమినీ వారు సేఫ్ అయిపోయినట్టు తెలుస్తుంది.లాక్ డౌన్ ఉండటం వల్ల బాగా కలిసొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రాన్ని కూడా వీళ్ళే కొనుగోలు చేసారు. మే 1 న ప్రీమియర్ ను టెలికాస్ట్ చేయనున్నారు. మరి ఈ చిత్రం ఎంత టి.ఆర్.పి ని నమోదు చేస్తుందో చూడాలి. ఇటీవల టెలికాస్ట్ చేసిన మలయాళం వెర్షన్ కు 11.17 టి.ఆర్.పి రేటింగ్ ను రాబట్టింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus