అల్లు అయాన్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. పుష్ప ది రూల్ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తుండగా పుష్ప ది రూల్ ప్రమోషన్స్ లో తర్వాత సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పుష్ప ది రూల్ సినిమాకు కూడా సీక్వెల్ కూడా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.

మరోవైపు బన్నీ పిల్లలు సైతం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సత్తా చాటుతున్నారు. బన్నీ కొడుకు అల్లు అయాన్ తండ్రిని ఇమిటేట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయాన్ స్వాగ్ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అల్లు అయాన్ తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిగా అభిప్రాయపడుతున్నారు.

అల్లు అయాన్ టాలెంట్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అల్లు అయాన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలలో నటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు అయాన్ వీడియోకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. బన్నీని ఇమిటేట్ చేస్తున్న అల్లు అయాన్ భవిష్యత్తులో సంచలనాలు సృష్టిస్తాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది.

అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండేళ్లకు ఒక సినిమాలో నటించేలా బన్నీ కెరీర్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది. బన్నీ రాజమౌళి కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి. జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా రిలీజైన తర్వాతే జక్కన్న కొత్త సినిమాల గురించి క్లారిటీ రానుంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus