Allu Bobby: అల్లు వారి మూడో ప్రొడ్యూసర్.. సేఫ్ గేమ్!

సినిమా ప్రపంచంలో నిర్మాతగా ఉండడం అంత ఈజీ కాదు. చాలా రిస్క్ తో కూడుకున్న పని. డైరెక్టర్ కంటే కూడా నిర్మాత ముందే స్క్రిప్ట్ ను పసిగట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. యావరేజ్ అనుకున్న సినిమాలు కూడా నష్టాలను తెస్తున్నాయి. ఇక అందుకే కొందరు నిర్మాతలుగా మారడానికి చాలానే ఆలోచిస్తున్నారు.ఇక అల్లు ఫ్యామిలీ నుంచి మరో నిర్మాత తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

అల్లు రామలింగయ్య అనంతరం ఆయన తనయుడు అరవింద్ అగ్ర నిర్మాతగా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక వారి తరువాత ఇంటికి పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ (బాబీ) కూడా నిర్మాతగా అడుగులు వేస్తున్నాడు. అయితే ఆ మ్యాటర్ లో మాత్రం చాలా సేఫ్ గా అడుగులు వెయిస్తున్నారు.వరుణ్ తేజ్ తో గని సినిమాను నిర్మిస్తున్న అల్లు వెంకటేష్ బడ్జెట్ మొత్తం ముందే వెనక్కి వచ్చేలా చేసుకునేల సెట్ చేసుకున్నాడు. అల్లు అరవింద్ గని సినిమా శాటిలైట్,

డిజిటల్ హక్కులను తీసుకొని సినిమా బడ్జెట్ వెనక్కి వచ్చేలా సేఫ్ సైడ్ లో ఉంచారు. ఇక విడుదల అనంతరం హిట్ టాక్ వస్తే వచ్చేవన్ని కూడా లాభాలే. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి. గని సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus