Allu Sirish: గర్ల్ ఫ్రెండ్ విషయంలో తెగ ఫీల్ అవుతున్న అల్లు శిరీష్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అరవింద్ వారసుడిగా అల్లు శిరీష్ అందరికీ పరిచయమే. ఈయన ఇండస్ట్రీలోకి గౌరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈయన నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవడం కోసం అల్లు శిరీష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ ఫన్నీ పోస్టులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇక ఈ మధ్యకాలంలో శిరీష్ చేసే పోస్టులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ వివాహంలో ఈయన చేసిన హంగామా మామూలుగా లేదు అదే విధంగా దీవాలి సెలబ్రేషన్స్ లో కూడా మంచు లక్ష్మికి ముద్దు పెడుతూ వార్తల్లో నిలిచారు. ఇక ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలు ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎన్టీఆర్ మనస్తత్వం ఎలాంటిది అనే విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇలా తరచూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నటువంటి (Allu Sirish) అల్లు శిరీష్ తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈయన షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో భాగంగా తన ఏజ్ తో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా అమ్మాయిలతో ఎంచక్కా తిరుగుతూ సంతోషంగా ఉండగా నేను మాత్రం ఇలా జిమ్ లో ఐదు కేజీల డంబెల్ ఎత్తుకుని వర్కౌట్లు చేస్తున్నాను అన్నట్టుగా ఓ రీల్ ఉంది.

ఈ రిల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ ..తన జీవితం కూడా ఇప్పుడు అలానే ఉందంటూ ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేశాడు అల్లు శిరీష్. ఈ పోస్ట్ చూస్తుంటే ఈయనకు గర్ల్ ఫ్రెండ్స్ లేకపోవడంతో తెగ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus