Anu Emmanuel: మరోసారి హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ ఎఫైర్!

టాలీవుడ్ హీరో అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మానుయేల్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, కాఫీ షాప్స్ అంటూ ఈ జంట కలిసి తిరగడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. ఎప్పటికప్పుడు వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

అందుకే షూటింగ్ గ్యాప్ లో పలు వీడియోలతో ఈ జంట జచ్చ చేస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఆ మధ్య అను ఇమ్మానుయేల్ పుట్టినరోజు సందర్భంగా అల్లు శిరీష్ షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అనుకి బర్త్ డే విషెస్ ఆలస్యంగా చెప్పడం, దానికి ఆమె అలగడం.. అల్లు శిరీష్ ప్లీజ్ చేసుకోవడం.. ఇలా ప్రతీసారి ఆమెతో కలిసి శిరీష్ చేసే వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ జంట హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా అల్లు శిరీష్.. అనుకి ఓ గిఫ్ట్ పంపించాడు. ప్రెట్టీ లిటిల్ సైకో అని రాసి ఉన్న టీషర్ట్ ను ఆమెకి గిఫ్ట్ గా పంపగా.. దానిపై స్పందించిన అను ఇమ్మానుయేల్.. ఇది కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను అని చెప్పింది. ఇలా తనకు సెట్ అయ్యే టీషర్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చింది. దానిపై స్పందించిన అల్లు శిరీష్.. మన ఇద్దరిలో కామన్ విషయాలు చాలా ఉన్నాయి.. ఎనీ వే యు ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ డ్యాష్ పెట్టాడు. అల్లు శిరీష్ అలా డ్యాష్ పెట్టడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus