Allu Sirish: రష్మిక, హన్సిక రికార్డులను బ్రేక్ చేసిన అల్లు శిరీష్..!

  • April 2, 2021 / 03:37 PM IST

మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా పాపులారిటీని సంపాదించుకుని.. ఆ క్రేజ్ ద్వారా సినిమాల్లో అవకాశాల్లో దక్కించుకుంటూ ఉంటారు బాలీవుడ్ జనాలు. అయితే తెలుగులో మాత్రం అలాంటి సంస్కృతి లేదు. అలాంటి వాటికి ఇక్కడి జనాలు చాలా దూరంగా ఉంటారు. ఎక్కువగా ఈ లిస్ట్ లో బాలీవుడ్ సెలబ్రిటీలే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సౌత్ నుండీ రష్మిక, హన్సిక, అల్లు శిరీష్ వంటి వారు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి వాటి ద్వారా బాలీవుడ్ జనాలకు పరిచయమయ్యారు.

రష్మిక ‘టాప్ టక్కర్’ , హన్సిక ‘మజా’ ‘బూటీ’ షేక్, అల్లు శిరీష్ ‘విలాయతీ షరాబ్’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. వీటన్నిటికీ మంచి ఆదరణే లభించింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అల్లు శిరీష్ చేసిన ‘విలాయతీ షరాబ్’ ఆల్బమ్ టాప్ లిస్ట్ లోకి చేరింది. రష్మిక ‘టాప్ టక్కర్’ కు 72 మిలియన్ వ్యూస్ నమోదవ్వగా, హన్సిక ‘మజా’ కి 62 మిలియన్ వ్యూస్, ‘బూటీ షేక్’ కు 44 మిలియన్ వ్యూస్ నమోదవ్వగా..

అల్లు శిరీష్ ‘విలాయతీ షరాబ్’ వీటన్నిటినీ బీట్ చేసేసి ఏకంగా 92 మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసి.. 100 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకుపోతుంది. ఈ సాంగ్లో శిరీష్ చాలా స్టయిలిష్‌గా డాన్స్ మూమెంట్స్ చేసి శభాష్.. అనిపించుకున్నాడు.ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది అంటే.. ఇది ఏ స్థాయి విజయాన్ని సాధించిందో స్పష్టమవుతుంది.


రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus