పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన కి పని చేస్తా : సునీల్

హాస్య నటుడిగా పేరు తెచ్చుకుని, హీరోగా నిలబడిన నటుడు సునీల్. అతను అభిమానించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెబితే జనసేన పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జక్కన్న సినిమా విజయానందంలో ఉన్న సునీల్ ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర సంగతులు వెల్లడించారు. పూలరంగడు చిత్రం తర్వాత అమ్మాయిల్లో తనకు క్రేజ్ పెరిగిందని, ఎంతో మంది ప్రపోజ్ చేశారని తెలిపారు.

వైజాక్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ అమ్మాయి యూనిట్ సబ్యులందరూ చూస్తుండగా తనని ముద్దు పెట్టుకుందని, షాక్ తిన్నానని వివరించారు. హాస్యనటుడి నుంచి హీరోగా మారిన తర్వాత అవకాశాలు తగ్గాయని వస్తున్నా వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. ప్రస్తుతం చేతినిండా అవకాశాలతో తాను సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాను ఎప్పుడు హాస్యనటుడిగా చేయనని చెప్పలేదని, మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంలో మంచి రోల్ తో కనిపిస్తానని అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus