నటి అమలాపాల్ పెళ్లి వార్త కొద్దిరోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె సింగర్ భవీందర్ సింగ్ ని రెండో వివాహం చేసుకున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇక అమలాపాల్, భవీందర్ కలిసి సాంప్రదాయ పెళ్లి బట్టలలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ ఫోటోలలో ఇద్దరు లిప్ లాక్ పోజులో కూడా కనిపించడంతో అందరూ వీరి పెళ్లిని కన్ఫర్మ్ చేశేశారు. దీనితో రెండు రోజులుగా వరుస కథనాలు వీరి పెళ్లిపై ప్రసారం అవుతున్నాయి. ఐతే అనూహ్యంగా నటి అమలా పాల్ ఈ కథనాలను ఖండించారు.
తనకు భవీంధర్ తో పెళ్లి కాలేదని ఆమె చెప్పడం ఆసక్తి రేపింది. మరి ఆ ఫోటోల సంగతేంటని అడిగితే అవి కేవలం ఓ ఫోటో షూట్ కోసం కలిసి దిగినవి తప్పితే తను రెండో పెళ్లి చేసుకుందన్న వార్తలలో నిజం లేదని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇక దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని అమలా పాల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011 నుండి డేటింగ్ లో ఉన్న ఈ జంట 2014లో చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఐతే వీరి పెళ్ళైన మూడేళ్లకు 2017లో విడాకులు తీసుకోవడం జరిగింది. వీరి డైవర్స్ కి కారణం అమలా పాల్ సినిమాలలో పెళ్లి తరువాత కూడా నటిస్తాను అనడమే అని తెలుస్తుంది. ఐతే అవి కాకా వేరే కారణాలు కూడా ఉన్నాయి అనే ప్రచారం జరిగింది.